రజనీ సమ్మోహనాస్త్రంతో జయకు చెక్‌

రజనీ సమ్మోహనాస్త్రంతో జయకు చెక్‌

ఉత్తరాదిపై పట్టు తెచ్చుకున్న బీజేపీ.. తాజాగా దక్షిణాదిపై దృష్టి సారిస్తోంది. గతంలో మాదిరికాకుండా.. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించని పక్షంలో.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని కమలనాథులు గుర్తించారనే చెప్పాలి.

అందుకే మరో రెండేళ్లలో తమిళనాడులో జరిగే ఎన్నికల్లో జయలలితకు చెక్‌ చెప్పేందుకు బీజేపీ కిందామీదా పడుతుంది. తన ఆశలన్నీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మీద పెట్టింది. వాస్తవానికి పదేళ్ల కిందటే.. రాజకీయాల్లోకి వచ్చేందుకు రజనీకాంత్‌ ఆసక్తి చూపారని..కాకపోతే.. ఒకసారి వచ్చాక వెనక్కి వెళ్లేఅవకాశం లేనందున తొందరపడటం అంత మంచిది కాదన్న భావనతో పాటు.. తన మైండ్‌సెట్‌కు రాజకీయాలు అంతగా సరిపోవన్న భావనతో ఇంతకాలం దూరంగా ఉన్నారని చెప్పాలి.

కానీ.. తమిళనాడులో పాగా వేసేందుకు రజనీకాంత్‌ సాయం అవసరమని బీజేపీ భావిస్తోంది. అందుకే.. 2016లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి.. రజనీకాంత్‌ను పార్టీలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించట ద్వారా ఎంతోకొంత సానుకూలత ఏర్పడుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజాగా.. బీజేపీ అగ్రనేతలు రజనీకాంత్‌కు రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

రాజకీయాల విషయంలో.. రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి వేసే రజనీకాంత్‌ బీజేపీ ఫోర్స్‌ చేసినంత మాత్రాన రాజకీయ బురదగుంటలోకి కాలుపెట్టేస్తారా? చూడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు