దాసరి బొగ్గు సౌ‘భాగ్యం’

దాసరి బొగ్గు సౌ‘భాగ్యం’

దర్శకరత్నగా సుపరిచితుడు... బొబ్బిలిపులిగా పరిచితుడు... సౌ‘భాగ్యం’ మీడియాగా సగటు మనిషికి అపరిచితుడైన దాసరి నారాయణరావుకు పెద్ద కష్టమే వచ్చి పడింది. 10.67లక్షల కోట్ల రూపాయిలు (ఒకసారి ఈ అంకెను పేపర్ మీద రాసేందుకు ప్రయత్నించండి) కుంభకోణంలో నాటి బొగ్గు సహాయమంత్రిగా ఉన్నదాసరిపైన మొదట్నించి సందేహాలు ముసురుకున్నా.. ఫస్ట్ రౌండ్లో  కేవలం ప్రశ్నలేసి వదిలేశారు. కానీ.. ఈ స్కాంతో సంబంధం ఉందంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసేదాకా రాష్ట్రంలోని ఏ మీడియా ఆయన గురించి పెద్దగా రాసింది లేదు. అందరివాడిగా అనిపించుకునే దాసరి పత్రికల పతాక స్థానంలో వచ్చిందంటే అది సీబీఐ పుణ్యమేనని చెప్పాలి. రాష్ట్రంలో ప్రతి స్కాం గురించి టన్నుల టన్నుల పేజీలు రాసే మీడియా సంస్థలు... బొగ్గు స్కాంలో ఆయన ప్రాత్రపై జాతీయమీడియా ప్రస్తావించినా పెద్దగా పట్టించుకోలేదు. సీబీఐ ఎఫ్ఐఆర్ ని అనుసరించిచూస్తే ఆయనపై 2.25కోట్ల రూపాయిలు జిందాల్ నుంచి దాసరి కంపెనీలకు వచ్చాయన్నది ఆరోపణ. దాదాపుగా మనకు సుపరిచితమైన జగన్ బాబు క్విడ్ ప్రో మాదిరేనన్నమాట.

అయితే.. కాగ్ నివేదిక ప్రకారం ఈ బొగ్గు స్కాం విలువ రూ.10.67కోట్లు అయినప్పుడు మన దర్శక రత్నది అందులో రూ.2.25కోట్లు మాత్రమేనా అన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. అయితే.. కనిపించని కోణం ఖరీదు చాలానే ఉంటుందన్న వాదన రాజకీయవర్గాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ... సీబీఐ పేర్కొంటున్నట్లు దాసరి చేతివాటం రూ.2.25కోట్లు మాత్రమే అయితే మాత్రం... చాలా తక్కువ మొత్తానికే బుక్ అయినట్లేనంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించటం గమనార్హం. ‘‘ఈ రోజుల్లో రెండు కోట్లు అంటే ఏముందంది. అదీ ఆయన స్థాయికి చాలా చిన్న మొత్తం’’ అంటూ సదరు నేత చెప్పిన మాటను వెనుక అర్థం ఏమై ఉంటుందంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English