పార్టీ మార్పుపై డీఎల్ డిసైడ్ అయినట్లే

పార్టీ మార్పుపై డీఎల్ డిసైడ్ అయినట్లే

డీఎల్ రవీంద్రారెడ్డి ఎజెండా ఒక్కటే. తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంతు చూడటమే. అందుకే ఆయనీమధ్య ఆయన మనసులోకి దూరిపోతున్నారు. అక్కడ గుట్టుగా ఉన్న విషయాల్ని బయటపెట్టేస్తున్నారు. ఎవరి మాట వినని ముఖ్యమంత్రి ముందుకెళుతున్న కిరణ్ కుమార్ రానున్న ఎన్నికల్లో పోటీనే చేయరట. ఎందుకంటే.. చేసినా గెలవరు కాబట్టి. రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయి అమెరికాలో సెటిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందట. అంతేకాదు సీఎం బ్రదర్స్ జైలు కెళ్లే రోజులు కూడా దగ్గరపడినట్లేనని చెప్పేశారు. అంతేనా.. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పారు.

అదేమంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదట. ఇక.. కడప జిల్లాలో అయితే కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరట. ఇక్కడో చిన్న డౌటు డీఎల్ గారు. ‘నా శవం మీద కప్పేది కాంగ్రెస్ జెండానే’ అని ఈ మధ్య కమిట్ అయ్యారు కదా.. కాంగ్రెస్ కు అపరభక్తుడైన మీరు సైతం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయటం లేదా? కడప జిల్లాలో కాంగ్రెస్ కు అభ్యర్థులే లేరంటే... మీరు కాంగ్రెస్ నుంచి పోటీ చేయకూడదని డిసైడ్ అయినట్లేనా? అంటే.. మీరు పార్టీ మారేది పక్కా అన్నమాట. అరెరే.. డీఎల్ గారు.. విషయాన్ని సూటిగా చెప్పకుండానే ఎంత విషయాన్ని సింఫుల్ గా చెప్పేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English