డీఎల్ ని హైకమాండ్ ఏం పీకలేదు...

డీఎల్ ని హైకమాండ్ ఏం పీకలేదు...

‘‘దీన్ని మాత్రం మీ హైకమాండ్ ఏం పీకలేదుగా’’ ఈ మాటను యదాతథంగా అన్న వ్యక్తి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. ఆయన అన్నది మరో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితో. ఇంతకు హైకమాండ్ తనది పీకలేదన్నది.. తన ఎమ్మెల్యే పదవిని. కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందా? వివరంగా చెబుతాం. అసెంబ్లీ సమావేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. రాజకీయ పార్టీలు ఏలా వ్యవహరిస్తున్నాయన్నది టీవీల్లో ప్రత్యక్షప్రసారాల ద్వారా తెలుసుకునే వీలు ఉంటుంది. కానీ.. విలేకరుల మాట వేరు. నిజానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంత కాలం.. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే వీలు... సగటు పొలిటికల్ జర్నలిస్ట్ కు ఉంటుంది.

మామూలుగా ఏదైనా ఫంక్షన్ కి కానీ నేతలు కలుస్తారు. అది కూడా పరిమితంగా. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతలంతా కలిసే ఒకే ఒక స్థలం అసెంబ్లీ. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా పలువురు ఎమ్మెల్యేలు కలుస్తుంటారు. మాట్లాడుకుంటారు. చురకలు వేసుకుంటారు. తప్పులు ఒప్పుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే... చూసుకున్నోడికి చూసుకున్నంత. తెలుసుకున్నోడికి తెలుసుకున్నంత. ఎమ్మెల్యేలు కూడా విలేకరుల సమక్షంలో చాలా స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు. ఒకవేళ అది ప్రైవేటు సంభాషణ అయితే.. దీని గురించి పేపర్లో ప్రస్తావించకూడదు బ్రదర్ అని చెప్పి మరీ.. వాళ్ల ముందే మాట్లాడుకుంటారు. సంప్రదాయాన్ని అనుసరించి.. ఆ మాటల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రచురించటం కానీ.. బయటకు వెల్లడించటం కానీ ఉండదు. ఇది అప్రకటిత నియమంగా నడుస్తుంది.

ఇలాంటి సంఘటనే అసెంబ్లీలో జరిగింది. కాకపోతే.. నేతలు ఓపెన్ గా.  అసెంబ్లీ లాబీల్లో డీఎల్ నడుస్తున్నప్పుడు... జేసీ దివాకర్ రెడ్డి కనిపించారు. ఇక్కడో విషయం చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేలు ఎవరితోనూ పెద్దగా కలవరు. వారి పనేంటో వారు చూసుకుంటారు. కానీ.. మరికొంత మంది దీనికి పూర్తి భిన్నం. జేసీ దివాకర్ రెడ్డి, జానారెడ్డి, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, శంకర్రావు ఇలా కొంతమంది కాస్త ఓపెన్ గా ఉంటారు. ఈ మధ్య బాధ్యతలు పెరిగి... బొత్స సత్తిబాబు ఓపెన్ గా ఉండటం తగ్గించటం అది వేరే విషయం. అలా... డీఎల్ నడుస్తున్నప్పుడు జేసీ కనిపించటం.. పలకరించుకోవటం జరిగింది. అప్పుడే డీఎల్ తన మనసులో ఉన్న అక్కసునంత వెళ్లగక్కారు. ‘‘నేనిప్పుడు స్వేచ్ఛా జీవిని. చాలా సంతోషంగా ఉంది’’ అంటూ మాట కలిపారు. దానికి జేసీ చిరునవ్వు నవ్వటంతో.. డీఎల్ నోట్లో నుంచి మరికొన్ని మాటలు వచ్చేశాయి. ‘‘మంత్రిగా తీసేసి మంచి పని చేశారు. ఇప్పుడు ఇది (ఎమ్మెల్యే పదవి) మీరు, మీ హైకమాండ్ ఎవరూ పీకలేరు కదా’’ అని వ్యంగంగా వ్యాఖ్యానించారు. దానికి జేసీ బదులిస్తూ... నా వైపు చూస్తూ మీరు అంటావేం అని ప్రశ్నించగా.. అదే.. మీరంటే... మీ నాయకుడో, ఎవరో అంటూ డీఎల్ నర్మగర్భంగా ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకొని అన్నారు. డీఎల్ తన సంభాషణను పొడిగిస్తూ.. ‘‘నా నెత్తిన పాలుపోశారు. లేకపోతే మా జిల్లా, నియోజకవర్గంలో డబ్బు ఖర్చు పెట్టకుండా మీటింగ్ లు పెట్టే పరిస్థితి ఉండేది కాదు. మొన్న నేను వెళితే రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వేల మంది వచ్చారు. నన్ను పదవి నుంచి తీసేసి నెత్తిన పాలు పోశారు’’ అంటూ చమత్కరించారు. డీఎల్ పదవి నుంచి తీసేశారని సానుభూతితో వచ్చిన ప్రజల గురించి ఆయన అన్న మాటలు యధాలాపంగా వచ్చినవనే అనుకోవాల

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English