ధర్మాన.. సబిత జైలు తప్పదా?

ధర్మాన.. సబిత జైలు తప్పదా?

మంత్రి పదవులు కోల్పోయి వేదన చెందుతున్న ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డికి కొత్త కష్టం వచ్చి పడింది. సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టు వద్ద సీబీఐ అభిప్రాయపడటం తెలిసిందే. తాజాగా.. దీనికి సంబంధించిన వ్యవహారం ఊపందుకుంది. ధర్మాన, సబితలను జ్యూడీషియల్ కస్టడీకి పంపాలంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించటం.. ఇరువురు మాజీ మంత్రులకు మరింత ఆందోళన కలిగిస్తుంది. దీనికి సంబంధించిన నోటీసులను జారీ చేసింది. తాము కేసుల నుంచి బయటపడతామంటూ విలేకరుల సమావేశంలో ధీమాగా మాట్లాడటమే తాజా పరిణామాలకు
కారణం. సాక్షులను ప్రభావితం చేసేలా మీడియాతో మాట్లాడారంటూ... అందుకు సంబంధించిన సీడీలను కూడా మెమోతో పాటు సీబీఐ న్యాయస్థానానికి అందించింది. దీనికి సంబంధించిన విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేశారు. ఒకవేళ సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించిన పక్షంలో... మాజీ మంత్రులిద్దరూ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. సీబీఐ న్యాయస్థానం నిర్ణయంపైనే వీరిద్దరు జైలుకు వెళ్లాలా... లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English