‘సంధ్య’ ఫోన్ నెంబరు శంకర్ రావుకు ఎందుకు...

‘సంధ్య’ ఫోన్ నెంబరు శంకర్ రావుకు ఎందుకు...

ఆంధ్రా రాడియాగా పేరొందిన సంధ్య. గుర్తుకురాలేదా? అదేనండి.. మొన్న ఎపీపీఎస్సీలో ఉద్యోగం దగ్గర నుంచి ల్యాండ్, జూడీషరీ  ఇలా ఇష్యూ ఏదైనా కానీ.. డీల్ అంటే డీల్ అంటూ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ కు అడ్డంగా బుక్ అయిన సంధ్య గురించి ఇప్పుడు చెప్పేది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా... టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రి శంకరరావులు ఎదురుపడ్డారు. ఆ సమయంలో శంకరరావు సీరియస్ గా రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చుట్టూ ఉన్న విలేకరులతో విశ్లేషించటం మొదలుపెట్టారు. మొదటితో పోలిస్తే...జగన్ వేగం కాస్త తగ్గిందని... అదే సమయంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర వల్ల పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ప్రజల్లో మాత్రం ఆయన గ్రాఫ్ పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిందేనని జోస్యం చెప్పారు.

ఈ సందర్భంగా రేవంత్ శంకర్ రావును ఉద్దేశించి.. ‘‘ఈ ప్రభుత్వంపై మేం పోరాడుతున్న దాంట్లో మీరు పదో వంతుకూడా పోరాడటం లేదు’’  అని అంటూ.. ఏపీపీఎస్సీ అక్రమాల గురించి ప్రస్తావించారు. ఏం మాట్లాడాలి చెప్పు.. మాట్లాడతా అని శంకరరావు రేవంత్ అను అడిగారు. ‘‘ఏపీపీఎస్సీ కుంభకోణంలో చక్రం తిప్పిన సంధ్య అనే మహిళకు... సీఎం కిరణ్ సోదరుల మధ్య ఎన్ని ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లు నడిచాయో విచారణ జరిపించమను అన్నీ బయటకు వస్తాయి.. కావాలంటే ఆమె ఫోన్ నెంబరు కనుక్కొని చెబుతా అని రేవంత్ అన్నారు. సరే... ఫోన్ నెంబరు ఇవ్వు విషయం తేల్చేద్దామనగానే.. రేవంత్ వెంటనే ఎవరికో ఫోన్ చేసి నెంబరు తీసుకొని... ఇదేనన్నా సంధ్య నెంబరు అంటూ ఇచ్చారు. మరి.. శంకరరావు ఏం చేస్తారో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English