ఆయన భయపడే అంశం వేరే ఉంది!

ఆయన భయపడే అంశం వేరే ఉంది!

ధర్మాన ప్రసాదరావు.. కాంగ్రెస్‌ పార్టీ ఈ రాష్ట్రంలో ఏలుబడి సాగుతూ ఉండగా తాను మంత్రి పదవిలో లేని రోజు వస్తుందని బహుశా ఊహించి ఉండరు. కాంగ్రెసు ప్రభుత్వం అంటూ ఎప్పుడు ఏర్పడినా అనివార్యంగా అందులో తాను మంత్రినే అవుతుంటానని ఆయన అనుకుంటూ ఉండిఉండొచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆయన తాజామాజీ! ‘చిం చచ్చినా పులుసు చావలేదు’  అన్నట్లు.. ధర్మాన కు పదవి ఊడిపోయింది గానీ..  ఆ పదవికి అనుగుణంగా ప్రాప్తించిన.. సకల రాజభోగాలు మాత్రం వదులుకో బుద్ధి కావడం లేదు. ఒక సాధారణ  ఎమ్మెల్యేగా తన ప్రజల సమస్య ల గురించి చర్చిండానికైనా శాసనసభ సమావేశాలకు రావాలనే విధ్యుక్త థర్మాన్ని గాలికొదిలేసి.. తన సొంత జిల్లాలో షికార్లు చేసుకుంటున్న ధర్మాన ప్రసాదరావు... తన వెంట మంత్రిస్థాయిలో తనకు ప్రభుత్వం అందించే సకల లాంఛనాలను, అధికార దర్పాన్ని, పోలీసు బలగాల రక్షణను సమస్తం వెంటబెట్టుకునే తిరుగుతున్నారు. ఎమ్మెల్యేగారి రక్షణ ఏర్పాట్ల నిమిత్తం.. ఆయనకు సపర్యలు చేయడానికి.. ఓ డిఎస్పీ సారథ్యంలో ఇద్దరు సీఐలతో పోలీసు బలగాలు ఆయన ముందు వెనుక ‘జీ హుజూర్‌’ అంటూ సిద్ధంగా తిరుగుతున్నాయి.

గతంలో తన గన్‌మెన్‌లతో చెప్పులు తొడిగించుకునే సంస్కృతి కూడా తనకు అలవాటే అన్నట్లు మీడియాకు కూడా చిక్కిన ఈ ధర్మాన దొరవారు.. తన దర్పానికి మాత్రం తగ్గకుండా.. నియోజకవర్గంలో తిరుగుతున్నారు.అయితే ధర్మాన ఓ జోకు పేల్చారు. తాను వాన్‌పిక్‌ కేటాయింపుల కేసులో అరెస్టు జరగవచ్చుననే ప్రచారానికి భయపడేది లేదని ఆయన అన్నారు. అరెస్టు అనేమాటతో తనను భయపెట్టడం జరగదన్నారు. కావొచ్చు. జైలు భయం ఆయనకు లేకపోవచ్చు గానీ.. అ మందీ మార్బలం, అధికార దర్పం.. తన వెంట లేకపోతే.. జనం తనను గుర్తించరని, పూచికపుల్లలా తీసిపారేస్తారనే భయం  మాత్రం మెండుగానే ఉన్నట్లుంది. అందుకే పదవిపోయినా.. ప్రాభవం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English