సింగ్ గారి ఫారిన్ జర్నీ ఖర్చు రూ.642కోట్లు

సింగ్ గారి ఫారిన్ జర్నీ ఖర్చు రూ.642కోట్లు

అధికారం రాజభోగం అని ఊరికే అనలేదు. కొన్ని కొన్ని విషయాలు తెలిస్తే.. మతి పోవాల్సిందే. అందులోకి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో అధికారం ఏమాత్రం అలంకారప్రాయమైతే కాదు. దాని హంగు.. ఆర్భాటం చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. మన మౌన ప్రధాని మన్మోహన్ సింగ్ గారి సంగతే చూద్దాం. ఆయన చూసేందుకు చాలా సింఫుల్ గా కనిపిస్తారు. కానీ.. ఆయనగారి విదేశీ ప్రయాణాలకు అయిన ఖర్చు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఎందుకంటే.. సింగ్ గారు గత తొమ్మిదేళ్లలో పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.642కోట్లు మాత్రమే.

ఈ విషయాన్ని ఏ ప్రతికా స్టింగ్ ఆపరేషన్ చేసి బయటపెట్టలేదు. ప్రధాని కార్యాలయమే  వెల్లడించింది.కాకపోతే.. సమాచార హక్కు చట్టం ఉంది కదా. దాని పుణ్యమా అని ఈ విషయం బయటకు వెల్లడైంది. సింగ్ గారు 2004 నుంచి దేశ ప్రధానిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన గారు పీఎం సీటులో కూర్చున్నప్పటి నుంచి ఇప్పటివరకూ 67 విదేశీ పర్యటనలు చేశారు. వీటిలో 62 జర్నీలకు సంబంధించిన బిల్లులు మాత్రమే దొరికాయట. వాటి లెక్కలు తీసి.. మొత్తం కూడితే 642కోట్లుగా తేలింది.

ఆయనగారి విదేశీ పర్యటనల్లో మెక్సికో, బ్రెజిల్ వెళ్లినప్పుడే అత్యధికంగా ఖర్చయిందట. ఈ రెండు పర్యటనల కోసం అయిన ఖర్చు... 25.94కోట్ల రూపాయిలు ఖర్చయింది. ఇది 2012 పర్యటన లెక్క. ఇదే దేశాలకు ఆయన 2010లో కూడా ఒకసారి వెళ్లారు. అప్పడేమో 22.70కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యాయట. మీరే మరీనూ... రూపాయి రేటు పడిపోవటం.. ధరలు ఆకాశాన్ని తాకటం అన్నీ తెలిసినవే కదా. మరి.. అలాంటప్పుడు రెండేళ్ల తేడాతో వెళితే.. ఆ మాత్రం ఖర్చు పెరగకుండా ఉంటుందా ఏంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English