అంబటి నీ గట్స్ అదుర్స్...

అంబటి నీ గట్స్ అదుర్స్...

రాజకీయ పార్టీల్లో స్వేచ్ఛ ఎక్కువ ఎక్కడంటే.. కాంగ్రెస్ వైపు చూపిస్తారు. దానికి పూర్తి భిన్నమైన.. అసలు స్వేచ్ఛ అంటే ఏమిటో కూడా తెలీని నేతలు ఉండే పార్టీలంటే.. టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ లను చూపిస్తారు. అక్కడ ఏ నేత అయినా సరే.. ఏం మాట్లాడాలన్నా కూడా ముందస్తు అనుమతులు తప్పనిసరి. ఏ విషయంలోనైనా.. పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడితే.. శంకరగిరి మాన్యాలే. అలాంటి పార్టీలో తెలిసి మాట్లాడుతున్నాడో.. తెలీక మాట్లాడుతున్నాడో కానీ షార్ట్ గన్ అంబటి రాంబాబు గత రెండు రోజులుగా చెలరేగిపోతున్నాడు. కాకపోతే.. ఆయన మాట్లాడే ప్రతి మాటను స్లోమోషన్ లో చదివితే... ఆయన మనసులోని మాటలు కూడా తెలిసిపోయేలా ఉండటమే ఆ మాటల ప్రత్యేకత.

జైల్లో రాజకీయాల గురించి మాట్లాడిన ఆయన ఆ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చేలా మాట్లాడాడు. జగన్ ను సీబీఐ జెల్లో పెట్టింది ఆయన బయట ఉంటే సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తారనే తప్ప... ఆయన్ను రాజకీయాలు చేసుకోవద్దని కాదంటూ చెప్పుకొచ్చారు. జైల్లో ఉంటే ఏ రాజకీయనాయకులూ కలవరాదని ఎక్కడా చెప్పలేదంటూ మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అంబటిగారి మాటల్ని యధాతథంగా తీసుకుంటే... జగన్ బయట ఉంటే సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తారనే కోర్టు ఆయన్ను జైల్లో ఉంచిందనే మాటకు పెద్దగా అభ్యంతరం లేనట్లే కనిపిస్తుంది.

కోర్టు వాదనను కూడా ఆయన సమర్థిస్తున్నట్లే కనిపిస్తుంది. దీన్ని బట్టి... జైలు బయట ఉంటే సాక్ష్యుల్ని ప్రభావితం చేసే సత్తా ఉన్నప్పుడు అదే పనిగా.. జైల్లో ములాఖాత్ లు చేస్తుంటే... జైలు నుంచి కూడా ప్రభావితం చేయడన్న గ్యారెంటీ  ఏమీ లేదు కదా. అదే విషయాన్ని తెలుగుదేశం నేతలు కూడా మొత్తుకుంటోంది. మొత్తానికి తమ బాస్ గొప్పతనం గురించి అంబటి చెప్పకనే చెప్పారని అనుకోవాలా? ఏదిఏమైనా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తన పాత పార్టీ వాసనలు పోగొట్టుకోకుండా ఉండే గట్స్ ఉన్నయ్ చూశారు. అదీ చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English