అధికారం పోతే అంతే సోనియమ్మా

అధికారం పోతే అంతే సోనియమ్మా

పదేళ్ల పాటు సింగిల్‌ హ్యాండ్‌తో దేశాన్ని రిమోట్‌ కంట్రోల్‌తో కంట్రోల్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియమ్మకు ఊహించని షాక్‌ తగిలింది. అధికారం ఉన్నప్పుడు అడుగులకు మడుగులు వత్తే వందిమాగంధులు కాస్తా.. అధికారం కాస్త దూరమయ్యేసరికి అడ్రస్‌ లేకుండా పోతారన్న నానుడి సోనియమ్మ విషయంలోనూ నిజం కావటంపై కాంగ్రెస్‌ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.

అయితే.. జరిగిన దాన్ని కవర్‌ చేసేందుకు కాంగ్రెస్‌ వర్గాలు ప్రయత్నించటం మామూలే. ఇంతకీ జరిగిందేమంటే.. శుక్రవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్‌ పార్టీపార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. సమయపాలన విషయంలో పక్కాగా ఉండే సోనియాగాంధీ అరగంట ముందే.. సమావేశ మందిరానికి వచ్చేశారు.

హడావుడి వచ్చి సమావేశ హాలు డోర్‌ తీసిన ఆమె షాక్‌ తిన్నంత పనైంది. ఎందుకంటే.. ఆ హాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. దీంతో.. నోట మాట రాని ఆమె.. నివ్వెరపోతు నిలుచుండిపోయారు. చివరకు సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు పార్టీ నాయకులకు తెలిసి అక్కడ నుంచి వడివడిగా వెళ్లిపోయారు.

దీనిపై పార్టీ వర్గాల వాదన మాత్రం మరోలా ఉంది. సమావేశం ఉన్నట్లు నాయకులకు ఎవరికీ సమాచారం వెళ్లలేదని.. అందుకే ఎవరూ రాలేదని చెబుతున్నారు. అయినా.. సోనియమ్మ లాంటి నేత మీటింగ్‌కి వస్తున్నారంటే.. దాని ఇన్ఫర్మేషన్‌ నేతలకు వెళ్లకుండా ఉంటుందా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు