అంత ప్రేమే ఉంటే ఫ్రీగా చేయొచ్చుగా

అంత ప్రేమే ఉంటే ఫ్రీగా చేయొచ్చుగా

నేను భారతీయురాల్ని.. ఎప్పటికీ భారతీయురాలిగానే ఉంటానని ఆవేశంతో కూడిన ఆవేదనతో సానియామీర్జా మాట్లాడేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ ఆ యమ్మ జనాలకు షాకులు ఇవ్వటమే కానీ.. జనం నుంచి ఇంత తీవ్రమైన ప్రతిస్పందన ఎప్పడూ చూడలేదు. భారతదేశం మీద అంత ప్రేమ ఉందనుకుంటే.. మరి.. అంతర్జాతీయంగా జరిగిన క్రీడోత్సవంలో భారత్‌ తరఫున బరిలోకి దిగి.. భారత జాతీయపతాకాన్ని పట్టుకోవటానికి ఎందుకు మక్కువ చూపలేదో కూడా సానియా వివరణ ఇస్తే బాగుంటుంది కదా?

మిగిలిన క్రీడాకారుల మాదిరి సానియా పేద క్రీడాకారిణి ఎంత మాత్రం కాదు. డబ్బులున్న భర్తతో పాటు.. ఎండార్స్‌మెంట్లతో భారీగానే డబ్బు సంపాదించారనే చెప్పాలి. భావోద్వేగంతో కదిలిపోయినట్లు ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసిన సానియా అంతే సీరియస్‌గా తాను (కొన్ని వైద్యపరమైన ఇబ్బందుల కారణంగా మహరాష్ట్రలో డెలివరీ అయ్యిందని చెప్పారు) తన తాత ముత్తాతలు హైదరాబాద్‌కు చెందిన వారేనని స్పష్టం చేశారు.

ఇంతవరకూ బాగానే ఉంది. తన మూలాల గురించి అంత బలంగా చెప్పిన ఆమె.. తన నియామకం గురించి వివరణ ఇస్తూ.. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ హోదాకు తాను అర్హురాలినేనని చెప్పుకున్నారు. ఇష్యూ ఎమోషనల్‌ అయినప్పుడు తుచ్చమైన డబ్బును కూడా తిరిగి ఇచ్చేస్తూ.. తమ తాత ముత్తాతలు పుట్టిన నేల తరఫున పని చేసే అవకాశం లభించటమే గొప్పని.. ఇలాంటి దానికి ఉచితంగా పని చేస్తా.. నాకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తున్నా అని చెప్పొచ్చుగా?

ప్రజల పట్ల నిజంగా అంత ప్రేమ ఉన్నప్పుడు ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తే ఆమెను విమర్శించే వారు సైతం వెనక్కి తగ్గుతారు కదా. చూస్తూ.. చూస్తూ కోటి రూపాయిలు వదులుకోవటం కష్టమే కదా అంటారా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు