సానియా ఇష్యూని మా గొప్పగా 'డైవర్ట్‌' చేశారే

సానియా ఇష్యూని మా గొప్పగా 'డైవర్ట్‌' చేశారే

తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఇష్యూ మా గొప్పగా డైవర్ట్‌ చేశారనే చెప్పాలి. సానియా నియామకం వ్యవహారంలో పార్టీలన్నీ మూకుమ్మడిగా వెనక్కి తగ్గటం కనిపిస్తాయి. ఆమె దేశానికి చేసిన సేవ మహా అద్భుతంగా ఎవరికి వారు పొగిడే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు.

తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియా మీర్జా నియామకంపై విమర్శలు ఎందుకు వచ్చాయి. ఆమె ముస్లిం యువతి అయినందుకో.. పాకిస్థాన్‌ కోడలు అయినందుకో కాదనే చెప్పాలి. కేసీఆర్‌ అనుసరిస్తున్న ధోరణిని సానియామీర్జా విషయంలో ఎత్తి చూపితే.. ప్రతిఒక్కరికి అయ్యో అంత అన్యాయంగా మాట్లాడతారా? అంటూ గంటలసేపు మాట్లాడటం మొదలుపెట్టారు.

ఒక మహిళ విషయంలో జరిగిన ఇష్యూపై సీరియస్‌గా స్పందిస్తున్నారు.మరి కోట్లాది మందికి సంబంధించిన విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదే రీతిలో వ్యవహరిస్తున్నప్పుడు ఆయన్ను ఎవరూ ఎందుకు వేలెత్తి చూపరు. కానీ.. సానియా విషయంలో తమకెంత విశాల హృదయం ఉందన్న విషయాన్ని పోటీ పడి ప్రదర్శించిన వారంతా... హైదరాబాద్‌లో దశాబ్దాల తరబడి ఉంటున్న వారిని స్థానికులు కాదంటే ఎవరికి మాత్రం ఆగ్రహం కలగదు.

ఈ విషయంలో కేసీఆర్‌ను వేలెత్తి చూపటం చేయకపోగా.. సానియా ఇష్యూని డైవర్ట్‌ చేయటం గమనార్హం. ప్రతి విషయంలోనూ తెలంగాణ.. తెలంగాణ అంటూ కొట్టుకునే కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఇష్యూలో సానియాకు మించిన స్థానికులు (కేసీఆర్‌ చెప్పే లోకల్‌ కాన్సెప్ట్‌లో మాత్రమే) లేరా అన్నది మరో ప్రశ్న. ఏదైనా విషయం మీద రియాక్ట్‌ అయ్యేటప్పుడు సదరు వ్యక్తులు ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం చేశారా? పాల్గన్నారా? ఒక్కసారైనా జై తెలంగాణ అన్నారా? అంటూ ప్రశ్నిస్తూ.. తమ వాళ్లకు తమ వాళ్ల బాధలు తెలుస్తాయని.. అందుకే తాను లోకల్స్‌ కోసం పడి చస్తానంటూ కేసీఆర్‌ చెప్పుకుంటారు.

మరి ఆ విషయాల్లో సార్‌ చెప్పిన మాటలన్నీ కరెక్ట్‌ అయితే.. సానియామీర్జాలో వచ్చిన విమర్శలు సైతం సహేతుకంగానే భావించాలి. అయినా.. సార్‌కు ఒక న్యాయం.. సానియాను విమర్శించిన వారికి మరో న్యాయం అంటే ఏం బాగుంటుంది చెప్పండి?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు