వీసా కాదు.. పాస్‌పోర్ట్‌ తరహాలోనంట

వీసా కాదు.. పాస్‌పోర్ట్‌ తరహాలోనంట

తెలంగాణకు వీసా తీసుకురావాలని భావిస్తున్నారా అంటూ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య గుర్తుందా? ఇప్పుడు అదే నిజమయ్యే పరిస్థితిని తెలంగాణ సర్కారు సృష్టించనునందా అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా ఉన్నాయి. తెలంగాణ స్థానికులు ఎవరు? స్థానికేతరులు ఎవరు అన్న విషయాన్ని గుర్తించేందుకు వీలుగా తెలంగాణ సిటిజన్‌ కార్డుల పథకాన్ని తెలంగాణ సర్కారు అమలు చేయాలని భావిస్తోంది.

బయటకు ప్రభుత్వం చెప్పే మాటేమిటంటే.. తెలంగాణలో నిజమైన పేదవారు ఎవరు?  వారి స్థితిగతులు ఏమిటి? ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎవరు అర్హులు లాంటి అంశాల్ని తేల్చేందుకు తాజాగా స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని తెలంగాణ సర్కారు తలపోస్తుంది. పైకి ఈ కారణం చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉంది?

అదేమంటే.. తెలంగాణలో ఉన్న అసలైన తెలంగాణ ప్రాంతీయులు ఎంతమంది? మిగిలిన వారు ఎంత మంది అన్న విషయాన్ని లెక్క తీయటంతో పాటు.. కేసీఆర్‌ సార్‌ డిసైడ్‌ చేసినట్లుగా 1956కు ముందు నుంచి తెలంగాణలో ఉన్న వారు మాత్రమే తెలంగాణ ప్రాంతీయులుగా గుర్తించే పనిలో భాగంగానే పాస్‌పోర్ట్‌ తరహాలో తెలంగాణ సిటిజన్‌ కార్డులుగా చెప్పొచ్చు.

ఉమ్మడి రాష్ట్రంలోఉన్నప్పుడు తెలంగాణ వస్తే వీసాలు తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్న వైఎస్‌ వ్యాఖ్యలకు తొలి అడుగుగా పాస్‌పోర్ట్‌ విషయాన్ని చూడాలన్న వాదన రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రాంతీయతత్వం మంచిదే కానీ.. హద్దుల్లో ఉంటేనే హాయిగా ఉంటుంది. ఏ మాత్రం శృతిమించినా అది లేనిపోని ఉద్రిక్తతలకు తావిస్తోందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు