జగన్ బాబు వచ్చేస్తున్నాడని చెప్పండి..

జగన్ బాబు వచ్చేస్తున్నాడని చెప్పండి..

తెగింపు మాటను ప్రస్తావించాలంటే ముందు జగన్ ఫ్యామిలీ గురించి చెప్పాకే..దాన్ని పలకాలి. ఎందుకంటే.. ఆ పదానికి పూర్థిస్థాయి సార్థకత ఆ కుటుంబమే తీసుకొచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వేలకోట్ల రూపాయిలు వెనకేసుకొని.. ఇప్పుడు పీకల లోతున కేసులో కూరుకుపోయి..ఏడాదిగా జైల్లో ఉన్న జగన్ బాబు ఎప్పుడు బయటకు వస్తాడో ఎవరికీ తెలీదు.ఇప్పుడిప్పుడే రాడని మాత్రం రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ తెలుసు. అయితే..జగన్ ఎక్కువకాలం జైల్లో ఉంటే... ఇప్పటివరకూ పార్టీలో ఉన్న వారంతా తట్టాబుట్టా సర్దుకోవటమే. జగన్ కు అధికారం చేతిలో లేకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది. ఏదో ఒకటి చేసి పవర్ తెస్తాడు కాబట్టి.. దాన్ని ఎంజాయ్ చేయాలని వచ్చిన చాలామంది నాయకులకి తాజా పరిణామాలు ఒకపట్టాన మింగుడు పడటం లేదు.సర్దుకుందామని మనసులో ఉన్నా.. జనం ఛీ కొడతారని ఆగుతున్నారు. ఎన్నికల సీజన్ దగ్గర్లో ఉన్నప్పుడు.. ఎవరి అభిమానం ఎలా ఉన్నా.. ప్రజాభిమానం మాత్రం తప్పనిసరి. అది కాస్త మిస్ అయితే... చరిత్రలో కలిసిపోవటమే. అందుకే ఊపిరి బిగపెట్టుకొని రోజులు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నారు. అయితే ఇప్పుడ
ఆ పార్టీ వాళ్లకి పెద్ద కష్టమే వచ్చి పడింది. పంచాయితీ ఎన్నికలకి కిరణ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో... ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్న విజయమ్మకు చిరాకేస్తుంది.

ఇప్పటికే కేసుల మూలంగా జనాల్లో పలుచన కావటం.. మరోవైపు నాయకులు అంత ఉత్సాహంగా లేకపోటంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతున్నారట. ఇలా అయితే జనరల్ ఎలక్షన్ వచ్చే నాటికి చాలా ఇబ్బందని.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఉత్సాహం కలిగించే మాట చెప్పాలని పార్టీ కీలకనేతలకు ఆదేశిస్తున్నారు. దాని సారాంశమేమంటే.. జగన్ బాబు త్వరలో వచ్చేస్తున్నారు. ఉత్సాహంగా పని చేస్తే.. భవిష్యత్తు మొత్తం బంగారమే అంటూ ఊరించమని చెబుతున్నారట. ఎవరైనా నమ్మకపోతే... నా నెంబర్ కి ఫోన్ చేయండి. నమ్మని వాళ్లతో నేనే డైరెక్ట్ గా మాట్లాడతానని హామీ ఇస్తున్నారట. ఈ మొత్తం వ్యవహారం చూసి... ఎప్పుడు బయటకు వస్తాడో తెలీని జగన్ గురించి విజయమ్మ ఇలా చెప్పటం చూసి.. తెగింపుకి ‘బరి’ అనే రెండు అక్షరాలు కలిపితే మరింత అందంగా ఉంటుందని ఫీలవుతున్నారు. మరి..మీరేమంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English