నేనెప్పటికీ భారతీయురాలినే- సానియా

నేనెప్పటికీ భారతీయురాలినే- సానియా

ఓ పాకిస్థాన్‌ కోడలిని తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకుంటారా.. మహారాష్ట్ర మూలాలున్న అమ్మాయి తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడరా.. అంటూ తననుద్దేశించి వస్తున్న విమర్శలపై సానియా మీర్జా మండి పడింది. తనకీ కొత్త బాధ్యతలు అప్పగిస్తూ కేసీఆర్‌ రూ.కోటి చెక్కు ఇవ్వడంపై ముసురుకున్న వివాదంపై సానియా ఘాటుగా స్పందించింది. ఎవరి పేరూ ప్రస్తావించకుండా ఈ వ్యవహారంపై ఓ స్టేట్‌మెంట్‌ విడుదల చేయడంతో పాటు.. ట్వీట్లు కూడా చేసింది.

''నేను భారతీయురాలిని. ఎప్పటికీ భారతీయురాలిగానే ఉంటా. నాపై పరాయిదానిగా ముద్ర వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నన్ను తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టడం చిన్న విషయం. దీని గురించి ఇంత సమయం వృథా చేస్తుండటం బాధిస్తోంది. కొన్ని ఇబ్బందుల వల్ల నేను ముంబయిలో పుట్టాల్సి వచ్చింది. కానీ మా తాత ముత్తాతలు హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇంకొకరి బాగు చూడలేని కొందరు వ్యక్తుల కోసం దేవుణ్ని ప్రార్థిస్తున్నా. ద్వేషంతో నిండిన వాళ్లపై దయచూపాలని అల్లాను కోరుతున్నా'' అని సానియా పేర్కొంది. మైనారిటీలను ఆకట్టుకునేందుకే సానియాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టారని, పాకిస్థానీ కోడల్ని ఎలా ఎంచుకుంటారని భాజపా.. సానియా కుటుంబానికి మహారాష్ట్ర అంటూ తెలుగుదేశం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు