'ఫాస్ట్‌' ఈజ్‌ ద బెస్ట్‌!

'ఫాస్ట్‌' ఈజ్‌ ద బెస్ట్‌!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రస్తుత రూపంలో కొనసాగిస్తే.. వైఎస్‌ హయాంలో ప్రారంభించిన కుంభకోణాన్ని కొనసాగించడమే అవుతుంది. ఈ పథకం విద్యార్థులకు ఎంతో మేలు చేసేది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో, ఈ పథకం కాలేజీ యాజమాన్యాల పాలిట కల్పతరువు అని.. అది భారీ కుంభకోణానికి కారణమనే విషయంలోనూ ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే, ఈ కుంభకోణానికి ఎక్కడో ఒకచోట చెక్‌ పెట్టాలి. ఆ ప్రయత్నాన్ని చేస్తున్న కేసీఆర్‌ను అభినందించాల్సిందే.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం.. తెలంగాణలో ఈ పథకం తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం (ఫాస్ట్‌) వర్తించాలంటే సదరు విద్యార్థికి 75 శాతం హాజరు ఉండాల్సిందేనని నిబంధన విధించనున్నారు. అలాగే, నిర్దిష్ట మార్కులు పొందితేనే పథకాన్ని ఆ తర్వాతి సంవత్సరాల్లో పథకం కొనసాగుతుందని, ప్రతిభావంతులకు పూర్తి సాయం చేస్తామని,, మిగిలిన వారికి పరిమితి విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇది మంచిదే. ఎందుకంటే, ప్రభుత్వం ఉచితంగా ఫీజులు కడుతోంది కదా అనే ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులు చదువు గురించి పట్టించుకోవడం లేదు.

 ఫీజుల పథకంపై ఎటువంటి పరిమితులు లేకపోవడంతో బలాదూర్‌గా తిరుగుతున్నవాళ్లూ ఉన్నారు. కొన్ని కాలేజీలు అయితే బోగస్‌ విద్యార్థులను సృష్టించి మరీ ఫీజులను జేబులో వేసుకుంటున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి సదరు ఫీజులను విద్యార్థి ఖాతాలోనే వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. వాస్తవానికి, ఇవన్నీ మంచివే. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి స్వస్తి పలకడానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందనే విమర్శలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకోవాల్సిందే. ఇక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పెట్టే స్థానికత అంశం కూడా వివాదాస్పదమే. 'ఫాస్ట్‌'కు షరతుల తరహాలోనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, ఆచరణ సాధ్యం కాని అడ్డగోలు నిబంధనలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే వివాదాస్పదం అవుతున్నాయి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు