ఇలా మొదలెడితే 20ఏళ్లు పడుతుంది

ఇలా మొదలెడితే 20ఏళ్లు పడుతుంది

మెదక్‌ జిల్లాలో కాకతీయ స్కూల్‌ బస్సును ప్యాసింజర్‌ ట్రైన్‌ ఢీ కొట్టిన సంఘటనలో 20కు పైగా మృతి చెందటంతో కాపలా లేని లెవల్‌ క్రాసింగ్‌లకు సంబంధించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. లెవల్‌ క్రాసింగ్‌ అంటే.. రోడ్లపై పట్టాలు ఉండి రైళ్లు పరిగెడుతూ ఉంటాయన్న మాట ఇలాంటివి. దేశవ్యాప్తంగా 31,846 ఉన్నాయి. వీటిలో ఎలాంటి గేటు కానీ.. కాపలా కాని లేకుండా ఉన్నవి దేశ వ్యాప్తంగా దాదాపు 13,530 చోట్ల ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న మన దగ్గర ఇలా కాపలా లేని లెవల్‌ క్రాసింగ్‌లు భారీగానే ఉన్నాయి.

వీటిన్నింటికీ గేట్లు ఏర్పాటు చేయటం సాధ్యం కాదంటూ గత యూపీఏ సర్కారుకు చెందిన రైల్వే మంత్రి చేతులెత్తేయటం జరిగింది. చస్తే చచ్చారు కానీ.. మేం మాత్రం లెవల్‌ క్రాసింగ్‌ దగ్గర కాపలా.. గేట్లు ఏర్పాటు చేయలేమని తేల్చారు. దీనిపై భారీగా విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

ఇక.. కాపలా లేని లెవల్‌ క్రాసింగ్‌ వద్ద గేట్ల ఏర్పాటుకు అవసరమయ్యే నిధులు రూ.37,846గా తేల్చారు. అయితే ఇంత భారీ మొత్తాన్ని ఒక్క లెవెల్‌ క్రాసింగ్‌ కోసం ఏర్పాటు చేయటం సాధ్యం కాని నేపథ్యంలో ఏడాదికి ఇంత అంటూ నిధులు కేటాయిస్తున్నారు. గతేడాది లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద కాపలాగేట్లు ఏర్పాటు చేయటానికి రూ.2,600కోట్లు కేటాయించారు.

ఈ లెక్కన దేశవ్యాప్తంగా ఉన్న లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద కాపలా ఏర్పాటు చేయటానికి దాదాపు 20ఏళ్లు పడుతుంది. ఈ లోపు ఇంకెంతమంది మరణించాలో. టెక్నాలజీ భారీగా పెరిగిందని చెబుతున్న ఈ తరుణంలో మనుషులు ప్రాణాల్ని తీసే ప్రమాదాల్ని అడ్డుకట్టవేసేలా ప్రభుత్వం ఎందుకు ఆలోచించదో?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు