నిర్లక్ష్యం డ్రైవర్‌దా.. రైల్వే శాఖదా?

నిర్లక్ష్యం డ్రైవర్‌దా.. రైల్వే శాఖదా?

ఒకరా ఇద్దరా.. ఏకంగా 20 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా 15 మంది గాయాలతో అల్లాడుతున్నారు. ఈ ఘోరానికి కారణమేంటని ఆరా తీస్తే.. నిర్లక్ష్యం అని సమాధానమిస్తున్నారు అందరూ. ఐతే ఆ నిర్లక్ష్యం ఎవరిదంటే కొందరు రైల్వే శాఖదంటున్నారు. కొందరు బస్సు డ్రైవర్‌దని అంటున్నారు. లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద కాపలాదారే లేకపోవడం, కనీసం సైరన్‌ కూడా వేయకపోవడం రైల్వే శాఖ వైపు నుంచి పెద్ద తప్పులుగా కనిపిస్తున్నాయి.

మరోవైపు ఇందులో డ్రైవర్‌ తప్పిదం కూడా లేకపోలేదంటున్నారు. విద్యార్థులను తీసుకెళ్లడానికి డ్రైవర్‌ ఆలస్యంగా వచ్చాడని.. ఈ నేపథ్యంలో బస్సును వేగంగా నడిపాడని, రైలు సంగతి పట్టించుకోలేదని అంటున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. అసలు రోజూ వచ్చే డ్రైవర్‌ ఈ రోజు రాలేదని, కొత్తగా వచ్చిన వ్యక్తే నిర్లక్ష్యంగా బస్సు నడిపి తన, చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని కూడా అంటున్నారు. ఏదేమైనా ఓ చిన్న నిర్లక్ష్యం కారణంగా 20 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు