జగ్గారెడ్డి పసుపు చొక్కా వేసుకుంటాడా?

జగ్గారెడ్డి పసుపు చొక్కా వేసుకుంటాడా?

తూర్పు జయప్రకాష్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి.. తెలంగాణలోని రాజకీయ నేతల్లో విలక్షణమైన వ్యక్తి. తెలంగాణ వాదిగా టీఆర్‌ఎస్‌ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. కానీ ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌ హస్తమందుకున్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి ఎప్పుడూ జగ్గారెడ్డినే ముందు పెట్టేది కాంగ్రెస్‌. మొన్నటి ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓ రేంజిలో ఖర్చు చేసినా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముందు నిలవలేకపోయాడు.

అప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడానికి ఆయన సుముఖంగా లేరని.. పార్టీ మారే యోచనలో ఉన్నారని.. తెలుగుదేశం పార్టీలోకి మారొచ్చని వార్తలొస్తున్నాయి. తిరిగి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేరు కాబట్టి.. ఆయనకు తెలుగుదేశం లేదా భాజపా ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఐతే మెదక్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పట్టుండటంతో ఆ పార్టీలో చేరితే.. ఎలాగూ పవన్‌ కళ్యాణ్‌ సపోర్ట్‌ కూడా ఉంది కాబట్టి జిల్లాకు నాయకత్వం వహించవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఐతే ఇదే విషయమై జగ్గారెడ్డిని ప్రశ్నించగా.. తెలుగుదేశంలో చేరాలని ఆ పార్టీ నాయకుల నుంచి ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమే కానీ.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు