తెలుగు యూత్‌ కోఆర్డినేషన్‌లో పాలెం శ్రీకాంత్‌

తెలుగు యూత్‌ కోఆర్డినేషన్‌లో పాలెం శ్రీకాంత్‌

తెలుగుదేశం పార్టీ యువతను ఆకర్షించడం మీద ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఒక రకంగా ఈ ఫోకస్‌ ద్వారా ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం చక్కనైనదే. ఎందుకంటే.. యూత్‌లో ఒకరికి పార్టీ పూర్తిస్థాయిలో నమ్మకం కలిగించగలిగితే గనుక... ఏ ఒక్క యువకుడు కూడా కేవలం తాను ఓటు వేసి ఊరుకునే విధంగా ఉండడు. కచ్చితంగా మరొకరికి తను నమ్మిన విషయం చెబుతాడు. అలాగే ఇంట్లో పెద్దలను కూడా ఎడ్యుకేట్‌ చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకే తెలుగుదేశం ప్రధానంగా యూత్‌ మీద ఫోకస్‌చేస్తోంది.  చంద్రబాబు తాను పాదయాత్రలో ఉన్న సమయంలోనే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వంద టికెట్లు యువత కేటాయిస్తానని చెప్పడం కూడా ఈ వ్యూహంలో భాగమే.

తాజాగా పార్టీ లోకేష్‌ ను రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలు కళాశాలలు, విద్యాసంస్థలు అధికంగా ఉండే ఊర్లకు పర్యటింపజేస్తూ ఆయన ద్వారా యువతకు సందేశం ఇప్పించే కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోంది. తెలుగు యువత పదవులేవీ లోకేష్‌ తీసుకోకుండా... పార్టీకి సంబంధించి యూత్‌ ఐకాన్‌గా ఆయన పర్యటించాలని అనుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి.. తెలుగుదేశం పార్టీ తెరవెనుక కీలకమైన మంత్రాంగం నడపగల సాంకేతిక మేధావుల్లో ఒకరైన పాలెం శ్రీకాంత్‌రెడ్డి కూడా అహరహం పనిచేస్తున్నట్లు సమాచారం.
యూత్‌ను అడ్రస్‌ చేసి లోకేష్‌ నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ముందే కేస్‌ స్టడీ లాగా యూత్‌ గేదరింగ్‌ గురించి ప్లాన్‌ చేయడానికి పాలెం శ్రీకాంత్‌రెడ్డి.. సుమారు ఆరునెలల నుంచి జిల్లాల్లోనే పర్యటిస్తున్నట్లు.. అక్కడి వారితో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు ఎన్టీఆర్‌ భవన్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English