రుణాలు చెల్లించేయమనడమేంటి మంత్రివర్యా!

రుణాలు చెల్లించేయమనడమేంటి మంత్రివర్యా!

రుణమాఫీ విషయంలో నెలన్నర పాటు నాన్చినందుకు ఎదుర్కొన్న విమర్శలు సరిపోలేదేమో ఏమో.. తెలుగుదేశం ప్రభుత్వం మరో మెలికతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటోంది. ఓవైపు రుణమాఫీ చేసేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించచి రెండు రోజులైనా కాలేదు.. అంతలోనే ఓ ఫిట్టింగ్‌తో ముందుకొచ్చారు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

రుణ మాఫీ వెంటనే అమలు కాదని.. వనరుల సమీకరణకు కాస్త సమయం పట్టే అవకాశమున్నందున బ్యాంకులకు రుణం చెల్లించే స్థితిలో ఉన్న రైతులు.. ఆ డబ్బు చెల్లించేసి కొత్త రుణాలు తీసుకోవచ్చని సెలవిచ్చారు మంత్రివర్యులు. ఇప్పుడు రుణాలు చెల్లించేసినా.. తర్వాత రుణ మాఫీ అమలయ్యాక డబ్బు వెనక్కి వస్తుందని చెబతున్నారాయన.

అసలు రుణ మాఫీ హామీ ఇచ్చింది ఎందుకు? రైతులు రుణాలు కట్టలేని దయనీయ స్థితిలో ఉన్నారని. మరి రుణ మాఫీ మీద ఆశలు రేకెత్తించి.. ఇప్పుడు ఉన్నట్లుండి డబ్బు కట్టమంటే ఎవరు కడతారు? పాత రుణాలు కట్టి కొత్తవి తెచ్చుకోవాలి అనడంలో ఉద్దేశమేంటి? ప్రభుత్వం అప్పులన్నీ కట్టే వరకూ కొత్తవి రావని చెప్పడమేగా? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా.. కాచుకుని ఉన్న ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం తప్ప ఒరిగేదేమైనా ఉందా మంత్రివర్యా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు