షరపోవాపై సచిన్‌ పెద్ద మనసు...!

షరపోవాపై సచిన్‌ పెద్ద మనసు...!

    ఇన్ని రోజుల పాటు ఈ విషయంలో ఉగ్గబట్టుకొని ఉన్న మీడియా.. ఎట్టకేలకూ సచిన్‌ వద్ద ఆ విషయాన్ని ప్రస్తావించేసింది! కొన్ని రోజుల కిందట రష్యన్‌ టెన్సిస్‌స్టార్‌ మారియా షరపోవా చేసిన వ్యాఖ్యానాలను సచిన్‌వద్ద ప్రస్తావించి మీడియా తన ముచ్చట తీర్చేసుకొంది! ౖ'సచిన్‌ ఎవరో తెలీదు..' అన్న షరపోవా మాటలను సచిన్‌ దగ్గరకే తీసుకెళ్లింది. ఈ మాటలు ఇప్పటి వరకూ సచిన్‌కు తెలియదన్నట్టుగా.. షరపోవా అలా అంది, మీరేం అనుకొంటున్నారు? అని టెండూల్కర్‌ను ప్రశ్నించింది!

    అయితే సచిన్‌ మాత్రం తనదైన శైలిలో హుందాగాస్పందించాడు. తను తెలియకపోవడంతో తప్పేముందని అడిగాడు. ఆమెకు క్రికెట్‌ గురించి, సచిన్‌ గురించి తెలియకపోవడంలో తప్పేముందిలేండి.. అంటూ టెండూల్కర్‌ వ్యాఖ్యానించాడు. షరపోవా విషయంలో పెద్దమనసుతో స్పందించాడు. తద్వారా మీడియా ముచ్చట కూడా తీరింది. 'మీరేవరో తెలీదంట చూడండి...' అంటూ సచిన్‌ వద్ద షరపోవా వద్ద ఫిర్యాదు చేసి సంచలన కామెంట్‌ను ఆశించిన మీడియాకు ఆశభంగం అయ్యిందని అనుకోవాలి.

    ఇక సచిన్‌ అభిమానులు కూడా ఈ విషయంలో సచిన్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. క్రికెట్‌ కొన్ని దేశాలకు పరిమితమైన క్రీడ అనే విషయాన్ని మరిచి.. మనవాళ్లు రెచ్చిపోయారు. షరపోవాను ఒక అజ్ఞానురాలిగా చూశారు. ఆమె పై ఇష్టాను సారం కామెంట్లు చేశారు. సచిన్‌కు మాత్రం విజ్ఞత ఉంది. అందుకే ఆయన క్రికెట్‌ పరిమితులను తెలుసుకొని.. షరపోవాకు తను తెలియకపోవడంలో ఆమె తప్పేముంది... అని సర్దిచెప్పాడు!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు