అమ్మ సభ అక్కడ పెట్టి ఉంటే ఇరగదీసేవారంట

అమ్మ సభ అక్కడ పెట్టి ఉంటే ఇరగదీసేవారంట

ఏదైనా తప్పు జరిగినప్పుడు చిన్న పిల్లాడ్ని నిలదీసి అడిగితే పిల్ల తరహా సమాధానాలు ఇస్తుంటారు. నిజానికి ఆ విషయంలో వారిని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. తల పండిన రాజకీయ నేతలు చెబుతున్న పిల్ల కారణాలతో పోలిస్తే.. తప్పు చేసిన పిల్లలు చెప్పే రీజన్స్‌ చాలా చక్కగా ఉంటాయని చెప్పొచ్చు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసిన కాంగ్రెస్‌ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు చతికిలపడింది? దశాబ్దాల కలను తీర్చినప్పటికీ తెలంగాణవాదుల మనసుల్ని కాంగ్రెస్‌ పార్టీ ఎందుకని కొల్లగొట్ట లేకపోయిందన్నది.. అధిష్ఠానానికి ఇప్పటికీ అర్థం కాని బ్రహ్మ పదార్ధంగా మారింది. దీంతో.. టీ కాంగ్రెస్‌ నేతలంతా కూర్చొని మధోమధనం జరిపి.. విషయం తేల్చమని అమ్మ తరఫువాళ్లు ఆదేశించారు.

దీంతో.. టీ కాంగ్రెస్‌ నేతలంతా కూర్చొని తెగ ఆలోచించి.. రకరకాల నివేదికలు.. రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకొని.. గంటల కొద్దీ చర్చించి చివరకు కొన్ని కారణాలే.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవటానికి కారణాలుగా తేల్చారు. ఆ అద్భుతమైన కారణాలు తెలుసుకునే ముందు.. కాస్త సీరియస్‌గా ఉండటం మంచిది.

ఎందుకంటే.. వారు చెప్పేరీజన్స్‌ విన్నాక కామెడీ.. కామెడీగా అనిపించి.. పగలబడి నవ్వితే.. ఉన్నట్లుండి అంతలా నవ్వుతున్నాడేంటిరా అని మీ చుట్టూ ఉన్న వారు వింతగా చూసే ఛాన్స్‌ ఉంది. అందుకే.. కాస్త నిదానంగా చూసి చదవండి. ఇంతకీ.. కాంగ్రెస్‌ ఓడిపోవటానికి అద్భుతమైన కారణాలేమంటే..

= తెలంగాణ రాష్ట్రం సోనియమ్మతో కూడిన కాంగ్రెస్‌ కృషి అంటూ సికింద్రాబాద్‌లో భారీ సభ పెట్టకపోవటం.

= కాంగ్రెస్‌ పార్టీ మేనిఫేస్టో ఆలస్యం కావటంతో పార్టీకి నష్టం జరిగింది.

= రైతులకు రుణమాఫీ అంశాన్ని మేనిఫేస్టోలో పెట్టకపోవటం.

= కొందరు నేతలు జంప్‌ అయిపోవటం.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు