బాలీవుడ్‌ భామల హైట్‌ తెలిస్తే ఉద్యోగమంట

బాలీవుడ్‌ భామల హైట్‌  తెలిస్తే ఉద్యోగమంట

వ్యవస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం అంటే ఇదేనేమో. విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకోవటం ఎంత సింఫుల్‌ అన్నది ఈ ఉదంతం చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగం రావటానికి బాలీవుడ్‌ హీరోయిన్ల ఎత్తు కరెక్ట్‌గా చెప్పటానికి ఏమైనా కనెక్షన్‌ ఉంటుందా?

కానీ.. ఘనత వహించిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌కు మాత్రం అది సబబుగా అనిపించింది. ఈ మధ్య నిర్వహించిన పోటీ పరీక్షలో ఇచ్చిన ఒక ప్రశ్న ఏమిటంటే.. కింద ఇచ్చిన నటీమణుల్లో ఎత్తైన నటి ఎవరంటూ.. ఆప్షన్స్‌ కింద.. హ్యూమా ఖురేషి, దీపికా పదుకునే, కత్రినా కైఫ్‌, ప్రీతిజంటా పేర్లు ఇచ్చారు. దీనిపై కేరళ మహిళా కమిషన్‌ మండిపడింది.

హీరోయిన్ల ఎత్తుకి.. ఉద్యోగానికి లింకేమిటంటూ నిలదీసింది. దీనికి ఎస్‌ఎస్‌సీి ఛైర్మన్‌ వివరణ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేసింది. దీంతో ఎస్‌ఎస్‌సీ బోర్డు అప్రమత్తమై.. ఇలాంటి తప్పులు మరోసారి జరగకుండా చూసుకుంటామని తిరుగులేని ఒక అపాలజీని చెప్పేసింది. ఇదే పరీక్షలో మరో ప్రశ్న కూడా మహిళల్ని కించపరిచేలా ఉందని.. ఈ రెండు ప్రశ్నల్ని తాము తొలగిస్తున్నట్లు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. హీరోయిన్ల హైటు ఎంత అడగాలన్న దరిద్రమైన ఆలోచనలున్న వారు ప్రశ్నాప్రత్రం తయారీలో ఉన్నారంటే.. కమీషన్‌ ఎంత చక్కగా పని చేస్తుందో ఇట్టే అర్థమవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు