కోదండం 'టీ' సర్కారు వైపా.. స్టూడెంట్స్‌ వైపా..?

కోదండం 'టీ' సర్కారు వైపా.. స్టూడెంట్స్‌ వైపా..?

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు గత కొన్ని రోజులుగా భారీ నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

వారి నిరసన  ప్రదర్శనలను పోలీసులు యూనివర్సిటీ దాటి బయటకు రానివ్వని పరిస్థితి. ఈ సందర్భంగా పోలీసులకు.. విద్యార్థులకు మధ్య తీవ్రస్థాయిలో వాదులాట.. తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు సంబంధించి ఏదైనా కష్టం వస్తే మాట్లాడే ప్రొఫెసర్‌ కోదండం సారు మాత్రం ఈ మధ్య సైలెంట్‌గా ఉంటున్నారు. వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కోదండం సారు మాత్రం తన మాటను మాత్రం చెప్పటం లేదు.

అంతపెద్ద తెలంగాణ అంశం మీదనే కరాఖండిగా చెప్పేసిన కోదండం మాష్టారు.. ఇప్పుడీరోజున విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందనుకున్న అంశంపై ఎందుకు స్పందించటం లేదు? ఒకవేళ విద్యార్థులు చేస్తున్న నిరసన నిజమే అనుకుంటే అదే విషయాన్ని పబ్లిక్‌గా చెప్పేసి సపోర్ట్‌ చేసేయొచ్చుగా? ఒకవేళ కాదంటే.. అదే విషయాన్ని విద్యార్థులకు చెప్పి వారిని మంచి మార్గంలో పెట్టచ్చు కదా. ఏమీ చెప్పకుండా.. అంత పెద్ద మనిషి తప్పించుకొని తిరగటం ఏమిటో?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు