విమాన ఘోరం: ఆక్రోశంతో ఓ తండ్రి లేఖ

విమాన ఘోరం: ఆక్రోశంతో ఓ తండ్రి లేఖ

17 ఏళ్ల పాటు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు.. ఉక్రెయిన్‌ వేర్పాటు వాదుల కర్కశత్వానికి బలవడంతో నెదర్లాండ్స్‌కు చెందిన ఓ తండ్రిలో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. ఉక్రెయిన్‌లో తిరుగుబాటు దారులకు క్షిపణి సమకూర్చి.. విమానం కూలిపోవడానికి కారణమని భావిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిననకు ఆయన ఓ ఘాటు లేఖ రాశారు.

అందులో తన 17 ఏళ్ల ఒక్కగానొక్క ముద్దుల కూతురు ఎల్స్‌ మిక్‌ను పొట్టన పెట్టుకున్న వేర్పాటు వాద నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. తన కూతురు భవిష్యత్తుపై ఎన్నెన్నో కలలు కందని.. వచ్చే ఏడాది పాఠశాల విద్య పూర్తి చేసి.. డెల్ఫ్‌ విశ్వవిద్యాలయంలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చేయాలనుకుందని.. అంతలోనే విమాన ప్రమాదంలో హఠాత్తుగా మరణించిందని.. తన జీవితాన్ని నాశనం చేసినందుకు మీరు గర్వపడుతుండొచ్చు.. ఇలా చేసినందుకు థ్యాంక్స్‌ అని ఆ తండ్రి పేర్కొన్నారు.

తన సందేశాన్ని మీరు (పుతిన్‌) తప్పక చదువుతారు.. లేకుంటే మీ సహాయకులైనా ఈ విషయం మీకు చేరవేస్తారు అంటూ హన్స్‌డే బోస్ట్‌ అనే డచ్‌ వాసి ఘాటుగా, వ్యంగ్యంగా లేఖ రాశారు. ఈ లేఖను యథాతథంగా డచ్‌ మీడియా ప్రచురించింది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు