ట్యాంక్‌బండ్‌పై ఉన్నవి పనికిమాలిన విగ్రహాలు

ట్యాంక్‌బండ్‌పై ఉన్నవి పనికిమాలిన విగ్రహాలు

ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేసీఆర్‌ తీరు మార్చుకోలేదు. ఒకప్పటి ఉద్యమ నేతలాగే భావిస్తూ నోరు జారారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్నవి పనికి మాలిన విగ్రహాలే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తూనే.. తాను ఏది మాట్లాడినా పంచాయితీ అంటున్నారని, మీడియానే వివాదాలు సృష్టిస్తోందని కేసీఆర్‌ అనడం విశేషం.

దాశరథి జయంతి సభలో కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దాశరథి గొప్ప కవి అని.. ఆయన లాంటి మహానుభావుల విగ్రహాలు ట్యాంక్‌ బండ్‌పై ఉండాలని కేసీఆర్‌ అన్నారు. దాశరథి సహా తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై ఉండాలనడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడక్కడ ఉన్నవన్నీ పనికిమాలిన విగ్రహాలే అనడం ఏం సంస్కారమో కేసీఆరే ఆలోచించాలి.

నన్నయ, తిక్కన, జాషువా, మొల్ల, అన్నమయ్య లాంటి గొప్ప వాళ్లను ఏదో ఒక ప్రాంతానికి పరిమితం చేయడం, కించపరిచేలా మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగునా అన్నది  సరిచూసుకోవాలి. కేసీఆర్‌ ఇలా మాట్లాడుతున్నారంటే త్వరలోనే ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాలకు మూడినట్లే అనుకోవాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు