కల్లు తాగిన కోతి అన్న రోజానే..

కల్లు తాగిన కోతి అన్న రోజానే..

''పవన్‌ కళ్యాణ్‌ కల్లు తాగిన కోతి.. అతనికి రాజకీయాల్లో ఓనమాలు తెలియవు.. ఆడవాళ్ల జీవితాలతో ఆటలాడాడు.. అతని వల్ల మాకొచ్చిన నష్టమేమీ లేదు'' అంటూ ఒకప్పుడు శివాలెత్తిపోయిన శ్రీమతి రోజా సెల్వమణి.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి హోల్‌ అండ్‌ సోల్‌ పవన్‌ కళ్యాణే కారణమని సూత్రీకరించింది.

ఎన్నికల్లో తమ పార్టీయే గెలవాల్సిందని.. కానీ పవన్‌ కళ్యాణ్‌ వచ్చి తమ విజయానికి అడ్డుపడిపోయాడని, తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో గెలిపించేశాడని రోజా అభిప్రాయపడింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఓ రేంజిలో విరుచుకుపడింది రోజా. బాబు ప్రకటించిన రుణ మాఫీలో స్పష్టత లేదని, ఆయన రైతుల్ని మభ్యపెడుతున్నారని విమర్శించింది.

కానీ లక్షన్నర వరకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించినా.. రైతులు తీసుకున్న బంగారం రుణాలతో పాటు.. డ్వాక్రా, చేనేత రుణాలు కూడా మాఫీ అని క్లియర్‌గా చెప్పినా.. ఆర్‌బీఐ రుణాల రీషెడ్యూల్‌కు అంగీకరించినా.. రోజాకు ఇంకెంత స్పష్టత కావాలో అర్థం కావడం లేదు. ఏదో వ్యతిరేకించాలి కాబట్టి విమర్శలు చేయడం కాకపోతే.. ఇందులో ఇంకా చంద్రబాబును తప్పుబట్టడానికేముంది?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు