ఖాళీలు 16 కానీ.. ఉప ఎన్నిక ఒక్కచోటే

ఖాళీలు 16 కానీ.. ఉప ఎన్నిక ఒక్కచోటే

గీత దాటిన ఎమ్మెల్యేలకు తీరని ఆశాభంగం. వ్యూహాత్మకంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను వెన్నుపోటు పొడుస్తూ.. పార్టీ జారీ చేసిన విప్ ను ఉల్లఘించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేల పదవికి అనర్హులని తేల్చారు. దీంతో నిన్నటిదాకా ఎమ్మెల్యేలుగా చలామణి అయిన వారంతా మాజీలుగా మారిపోయారు. అయితేనేం.. మూడు నెలలు, లేదంటే ఆర్నెల్లలో ఉప ఎన్నికలు రావా..? మా సత్తా చూపించకపోమా? అని ధీమా ఉండలేని పరిస్థతి.

ఎందుకంటే.. ఏ కారణం చేతనైనా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేని పరిస్థితే వస్తే... ఆర్నెల్ల లోపు ఉప ఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అయితే.. సాధారణ ఎన్నికలకు ఏడాది కంటే ఒక్క రోజు తక్కువ ఉన్నా ఉప ఎన్నికలు నిర్వహించరు. మే నాలుగో వారంతో గీత దాటిన ఎమ్మెల్యేలు పదవులు స్వీకరించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడింకా వారికి ఉన్న పదవీ కాలం పదకొండు నెలలే. అందువల్ల అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనేవి ఉండవు. కానీ.. ఒక్కస్థానంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కృష్ణ జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య చనిపోయే నాటికి సభ పదవీ కాలం ఏడాదిపైనే ఉంది. అందువల్ల... అసెంబ్లీలో ఖాళీలు 16 ఉన్నా.. ఉప ఎన్నికల జరిగేది ఒక్కచోట మాత్రమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English