కిరణ్ ది మైనార్టీ ప్రభుత్వం కానట్లే

కిరణ్ ది మైనార్టీ ప్రభుత్వం కానట్లే

బొమ్మ తిరిగింది. కిరణ్ సర్కారు దశ తిరిగింది. ఒక్క నిర్ణయంతో పరిస్థితి మొత్తంలో మార్పు వచ్చింది. బిక్కుబిక్కుమంటున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల నిండా గాలి పీల్చుకునే అవకాశం వచ్చింది. నిన్నమొన్నటిదాకా మైనార్టీ సర్కారు అన్న అపప్రధ నుంచి కిరణ్ సర్కారు విముక్తి అయింది. అదే సమయంలో... సభలో బొటాబొటి మెజార్టీ నుంచి అవిశ్వాస తీర్మానానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు దాదాపు ఆరు ఓట్ల అధిక్యంలో ఉంది.

ఇదంతా ఎలా సాధ్యమైందంటే.. స్పీకర్ వేటు మహిమగా చెప్పుకోవాలి. పార్టీలు జారీ చేసిన విప్ లను ఉల్లఘించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో.. ఇది సాధ్యమైంది. 15మంది ఎమ్మెల్యేలను అనర్హత కారణంగా స్పీకర్ వేటు వేయటంతో.. ఇప్పుడు వారంతా మాజీలైపోయారు. మొత్తం స్థానాలు 294 అయితే.. ఖాళీలన్నీ పోను సభ్యులంతా హాజరైతే ప్రభుత్వానికి 139మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ.. అధికారపక్షమైన కాంగ్రెస్ పార్టీకి 146 మంది సభ్యుల బలం ఉంది. దీన్లో స్పీకర్ ఓటును తీసి పక్కన పెడితే 145 మంది ఆ పార్టీ కింద ఉన్నట్లు. అసెంబ్లీలో అవసరమైన బలం కంటే కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నట్లే.

ఇప్పుడిక... కిరణ్ సర్కారుని మైనార్టీ ప్రభుత్వం అనే అవకాశమే లేదు. ఒకవేళ.. మళ్లీ వైస్సార్ కాంగ్రెస్ మూడో కన్ను తెరిచి.. మరో గ్రూపు ఎమ్మెల్యేలను అధికారపక్షం నుంచి బయటకు తీసుకొస్తే తప్ప.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English