పొన్నాల మీద కన్నేసిన జానా !

పొన్నాల మీద కన్నేసిన జానా !

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రాజకీయ పార్టీలలో ప్రత్యేకం. ఆ పార్టీలో ఉన్నవారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడొచ్చు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు. అధిష్టానం ఏమంటుందో ? అన్న భయం అక్కర్లేదు. నాయకులు చేసేది నాయకులు చేస్తారు ..అధిష్టానం చేసేది అధిష్టానం చేస్తుంది. కాంగ్రెస్‌ పార్టీలో అంత అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది మరి.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు పోరు రాజుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీద సీఎల్‌పీ నేత జానారెడ్డి కత్తులు నూరుతున్నాడు. తనను కాదని ఎన్నికల ముందు పొన్నాల పీసీసీ అధ్యక్షుడు కావడం జానారెడ్డికి రుచించడం లేదు. ఇక ఇప్పుడు పొన్నాల ఓడిపోవడంతో మెల్లగా పొన్నాల పదవికి ఎసరు పెట్టే పనిలో పడ్డాడు జానారెడ్డి. వచ్చే నెల నాలుగున జానారెడ్డి తెలంగాణలో గెలిచిన, ఓడిపోయిన కాంగ్రెస్‌ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నాడు.

వాస్తవంగా అయితే ఈ పని పొన్నాల లక్ష్మయ్య అధ్యక్ష్యతన జరగాలి. అసలు పీసీసీ అధ్యక్షుడు పొన్నాలనే జానారెడ్డి టార్గెట్‌ కాబట్టి ఆయనకు చెప్పకుండానే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ భవిష్యత్‌ ప్రణాళికతో పాటు పొన్నాలకు కూడా ఈ సమావేశంలో చెక్‌ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పొన్నాల లక్ష్మయ్య కారాలు మిరియాలు నూరుతున్నాడట. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరి అధిష్టానం ఏం చేస్తుందో వేచిచూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English