జేఏసీని సైడ్ ట్రాక్ పట్టిస్తున్న కేసీఆర్!

జేఏసీని సైడ్ ట్రాక్ పట్టిస్తున్న కేసీఆర్!

తెలంగాణ రాష్ట్ర సమితికి ఉపశాఖగా మారిన తెలంగాణ రాజకీయ జేఏసీ ఈ మధ్య కాలంలో తన క్రెడిబులిటీని దారుణంగా కోల్పోతోంది. ఇప్పడు తన మనుగడను కూడా ప్రశ్నార్థంకం చేసుకుంటోంది. తెలుగుదేశం టార్గెట్ గా రాజకీయాలు మొదలుపెట్టగానే జేఏసీకి కష్టకాలం మొదలయ్యిందనుకోవాలి. అక్కడికీ జేఏసీనే టీఆర్ ఎస్ గా టీఆర్ ఎస్సే జేఏసీగా కొంతకాలం బండి లాగించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గరపడుతుండటంలో జేఏసీ ప్రాధాన్యత తగ్గిస్తూ... కేవలం టీఆర్ ఎస్ మాత్రమే ట్రాక్ పై నిలబడానికి అనువుగా కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంపై తనకొక్కడికే పేటెంట్ రైట్స్ ఉండాలని కోరుకుంటున్న కేసీఆర్... ఎన్నికల అదును చూసుకుని తోక జాడించ బోతున్న జేఏసీ నేతలను కట్టడి చేయడానికే ఈ ప్లాన్ వేశారని సమాచారం. ఎన్నికల సమయానికి తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు కేవలం టీఆర్ ఎస్ మాత్రమే కృషి చేస్తోంది, ఇంకెవరూ లేరు అని ప్రజలకు భ్రమ కలిగించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇది వరకూ జరిగిన ఉప ఎన్నికల్లో జేఏసీ మద్దతు ఎవరికి? అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యేది.

అయితే ఈ  సారి వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి జేఏసీ ఎక్కడ? అనే ప్రశ్న వచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు!  అందుకు పక్కా వ్యూహంతో ఉద్యమం నుంచి జేఏసీని దూరం చేస్తున్నాడు. ఇప్పుడు చలో అసెంబ్లీతో జేఏసీ ప్రస్థానానికి మంగళం పాడాలని కేసీఆర్ ప్లాన్. ఇప్పటికే రెండో విడత సడక్ బంద్ ఊసులో లేకుండా పోయింది. కర్నూలు హైవే మీద జరిపిన రోకోతోనే సడక్ బంద్ కు బ్రేక్ పడింది. విజయవాడ హైవే పై సడక్ బంద్ గురించి జేఏసీ పట్టించుకోవడం లేదు. ఇలా క్రమంగా తెలంగాణ జేఏసీ నిర్వీర్యం అవుతోంది!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English