వీహెచ్ అన్నట్టుగానే జరుగుతుందేమో!

వీహెచ్ అన్నట్టుగానే జరుగుతుందేమో!

కర్ణాటకలో పెళ్లికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చేస్తున్న హడావుడి ఇంకా తగ్గడం లేదు. కర్ణాటకలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల  అయినప్పటి నుంచి అక్కడ మన నేతల హడావుడే ఎక్కువగా ఉంది! ప్రచారంలో మనోళ్లే ముందున్నారు. దాదాపు డజనుమందికి పైగా నాయకులు కన్నడ నాట ప్రచార కార్యక్రమాలు నిర్వహించి వచ్చారు. ఇక కాంగ్రెస్ విజయం తర్వాత బాగా గంతులేసింది, ఆ విజయానికి క్రెడిట్ తమదేనని చెప్పుకున్నది కూడా మనోళ్లే!

ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధరామయ్య కు మనోళ్లు సన్మానం చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హడావుడి ఎక్కవగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజధాని నగరంలో అనేక చోట్ల సిద్ధరామయ్యకు స్వాగతం పలుకుతూ వీహెచ్ పేరు ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక సిద్దరామయ్యకు స్వాగతం పలకడానికి వీహెచ్ తన మంది మార్భలంతో విమానాశ్రాయానికి ఏగారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం గురించి వీహెచ్ స్పందిస్తూ అక్కడి ఫలితాలు ఇక్కడ కూడా పునరావృతం అవుతాయని అన్నారు. కర్ణాటకలో లాగే ఏపీలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది వీహెచ్ భావన కావొచ్చు! అయితే అక్కడ ఫలితాలే ఇక్కడ కూడా పునరావృతం అవుతాయి...అనడాన్ని బట్టి... అక్కడ అధికార పార్టీ ఓడిపోయింది కాబట్టి, ఇక్కడ కూడా అధికార పార్టీకి ముప్పు తప్పకపోవచ్చు అని అనుకోవాల్సి వస్తుంది! తీవ్రమైన అవినీతి, స్థిరమైన పాలన అందించలేక బీజేపీ కర్ణాటకలో బోల్తా పడింది. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అచ్చం కర్ణాటకలో బీజేపీనే పోలి ఉంది! మరి వీహెచ్ అన్నట్టుగా అక్కడి ఫలితాలు ఇక్కడ కూడా పునరావృతం అవుతాయేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English