జగన్ మళ్లీ ఎప్పుడు కనిపిస్తాడు...

జగన్ మళ్లీ ఎప్పుడు కనిపిస్తాడు...

నాంపల్లి కోర్టు వద్దకు జగన్ ను తీసుకురావటం.. ఆయన్ను చూసేందుకు తోపులాటలు.. పోలీసులతో వైఎస్సార్ నేతలు కలయబడేందుకు ప్రయత్నించటం.. కోర్టు ఆవరణ దగ్గర నినాదాలు.. కోర్టు హాల్లోకి అనుమతి లేని వారి ప్రవేశాలు... ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పెద్ద జాతర మాదిరి సీన్లు చోటు చేసుకున్నాయి. నిశ్శబ్దంగా ఉండాలంటూ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి ఆదేశించినా వినపడని పరిస్థతి. చివరికి విచారణను పదినిమిషాలు వాయిదా వేసి మరీ జడ్జి వెళ్లిపోయారు. ఇంత హడావుడి ఎందుకు జరిగినట్లు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. జగన్ కు కుప్పలకుప్పల ప్రజాభిమానం ఉందని.. ఆయన్ను విడుదల చేయాలని పెద్ద సంఖ్యలో ప్రజలు కోరుకుంటున్నారన్న కలర్ వస్తాయను కుంటే.. తాజాగా జరిగిన హడావుడితో మొదటికే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

కోర్టు హాల్లో... బయటా జరిగిన హడావుడి చూసిన న్యాయమూర్తి... న్యాయస్థానం సానుభూతిని కోల్పోవద్దని సున్నిహితంగా చేసిన వ్యాఖ్య వైఎస్సార్ కాంగ్రెస్ లో పెద్ద కల్లోలాన్నే సృష్టిస్తోంది. కొందరి నేతల అంచనాల ప్రకారం... తదుపరి విచారణకు సంబంధించి.. కోర్టుకు జగన్ హాజరు కావాల్సి వస్తే.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఎక్కవగా ఉంటాయన్న వాదన నెలకొంది. లేనిపోని హడావుడి.. జరిగే కన్నా.. కోర్టుకు అస్సలు రాకుండానే జైలు నుంచే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ ప్రక్రియను కోర్టులు పూర్తి చేయవచ్చు. తన పార్టీ నేతల ఓవర్ యాక్షన్ మూలంగా కోర్టుకు హాజరయ్యే సందర్బంగానైనా బయట గాలి పీల్చుకునే అవకాశం జగన్ కోల్పోయారేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నాంపల్లి కోర్టు దగ్గర చోటుచేసుకున్న వ్యవహారాలను న్యాయమూర్తులు సీరియస్ గా తీసుకుంటే.. ఇప్పట్లో జగన్ తన ముఖాన్ని ప్రపంచానికి చూపే వీలుండనట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English