మరి.. జైల్లో ఖాళీగా కూర్చుంటారా ఏంటి?

మరి.. జైల్లో ఖాళీగా కూర్చుంటారా ఏంటి?

మిగిలిన వారితో పోలిస్తే రాజకీయనాయకులు చాలా బెటర్. ఎంతోకొంత భోళాగా కనిపిస్తారు. మనసులోని మాటను పెద్దగా దాచుకోలేరు. ఏదో ఒక విధంగా బయటపడిపోతూ ఉంటుంది. అందుకే ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు పెదవి విప్పటానికి కూడా ఇష్టపడరు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అయితే వెటకారంగా మాట్లాడటం తప్పించి... మరో ముక్క మీడియా ముందు మాట్లాడటానికి పెదవి విప్పరు. వీలైనంత దూరంగా ఉంచుతారు. ఎందుకంటే.. ఆయనకు తెలుసు ఒకమాట మొదలుపెడితే.. ఏదో ఒకరంగా దొరికిపోతామని. అలా... ఎవరికి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు.

ఈ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ వేదికల మీద పెద్దగా కనిపించని అంబటి రాంబాబు... హటాత్తుగా ప్రత్యక్షమయ్యారు. చాలా రోజుల తర్వాత తెర మీదకు వచ్చిన ఆయన.. మనసులోని మాటను అనుకోకుండా బయటపెట్టేశారు. జైల్లో ములాఖాత్ ల పేరుతో జగన్ రాజకీయాలు చేయటంపై తెలుగుదేశం నేతలు విమర్శల వర్షం కురిపించటం తెలిసిందే. జగన్ జైలు చిట్టాను తెలుగు తమ్ముళ్లు విప్పుతుంటే.. రాంబాబుకు మా చెడ్డ చిరాకేసినట్లుంది. అందుకే ఆయన బాంబులాంటి మాటను యధాలాపంగా చెప్పేశారు. ఆయన్ని తప్పు పట్టానికి లేదు. ఆయన మాటల ఫ్లో అలాంటిది. జగన్ జైల్లో రాజకీయాలు చేస్తున్నారని తెలుగు దేశం నేతలు విమర్శలు చేస్తున్నారు. అయినా.. రాజకీయ నాయకుడు రాజకీయాలు కాక మరేం చేస్తాడు. జైల్లో ఉన్నామని రాజకీయాలు చేయకుండా వదిలిపెడతారా?  ఆయనకు రాజకీయం చేసే హక్కు ఉందంటూ ఆవేశంగా ప్రశ్నించారు.

అయితే ఆయన ఫ్లోను స్లో మోషన్ లో రివైండ్ చేసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మాత్రం తలలు కొట్టుకుంటున్నారు. అనవసర విషయాల మీద మాట్లాడేకంటే... ఇంకే దొరకలేదా? పోయి.. పోయి రాంబాబు మాటలు బాంబులుగా మారి ఏం కొంప ముంచుతాయోనని వాళ్లు బెదిరిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English