జానా - దామోదర.. అసంతృప్తులు విభేదాలు

జానా - దామోదర.. అసంతృప్తులు విభేదాలు

ఇది ఒకరకంగా ఇవాళ్టి రాజకీయాల్లో ట్విస్టు. కానీ చాలా చిన్న ట్విస్టు. ఉమ్మడి శత్రువుతో పోరాడేప్పుడు.. వారిద్దరూ కలిసే ఉంటారు. ఉమ్మడిగానే పోరు సల్పుతారు. అదే తమలో తాము డీల్‌ చేసే విషయంలో మాత్రం.. హఠాత్తుగా శత్రువులు అయిపోతారు. ఆ ఐక్యత ఉమ్మడి శత్రువు విషయంలో మాత్రమే ఉంటుంది.

ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల్లో, ప్రత్యేకించి మంత్రుల్లో, ప్రత్యేకించి జానారెడ్డి, దామోదర రాజనరసింహ మధ్య నెలకొన్న పరిస్థితుల్లో అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్‌ పట్ల వ్యతిరేకత ఉన్న మంత్రుల గ్రూపులో ఈ ఇద్దరూ కీలక వ్యక్తులు. బర్తరఫ్‌ అయిన మంత్రి డీఎల్‌ రవీంద్రరెడ్డి రేకెత్తించిన అనుమానాల ప్రకారం అయితే.. ఆయన బర్తరఫ్‌ ద్వారా సీఎం కిరణ్‌ బెదిరింపు సంకేతాలు పంపదలచుకున్న వారిలో వీరిద్దరు కూడా ఉన్నారు. అందుకే కాబోలు.. ఈ ఇద్దరూ డీఎల్‌ ఎపిసోడ్‌ ముగిసిన వెంటనే వీరు క్వార్టర్స్‌లో కలిసి భేటీలు వేశారు. ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్‌కు వ్యతిరేకంగా తాము చెప్పగలిగినదంతా చెప్పారు.

అయితే డిప్యూటీ రాజనరసింహ మాత్రం.. కిరణ్‌ మీద ఫిర్యాదులతో పాటూ.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న హోంశాఖను తనకే కేటాయించాలంటూ ఓ విజ్ఞప్తిని కూడా అధిష్ఠానం ఎదట దాఖలు చేసేశారు. అయితే ఇదే పదవి మీద జానారెడ్డికి కూడా కన్నుంది. పైగా తనకు అనుభవం కూడా ఉన్నది గనుక.. తనకే ఇవ్వాలని జానా కోరిక. అయితే డిప్యూటీ సీఎం చేతిలో హోం ఉండడం సాంప్రదాయం అని, ఇప్పుడు ఖాళీ వచ్చింది గనుక తనకే ఇవ్వాలని దామోదర కూడా అంటున్నారు. వివిధ కారణాల వలన దామోదర మాటకు  అధిష్ఠాన వద్ద (హోం విషయంలో) ఎక్కువ ఆమోదం దక్కినట్లుగా తెలుస్తోంది. తన ఆశలకు గండి కొట్టాడంటూ జానారెడ్డికి ఆయనపై అసంతృప్తి ఏర్పడిరది. ఇది కాస్తా విభేదాల దాకా ముదిరింది. ఈ అసంతృప్తిని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.

అయితే కిరణ్‌ స్లో అయినట్లుగా కనిపించినంత వరకే వీరిలో అసంతృప్తులు, విబేదాలు బయటపడతాయి. కిరణ్‌ మళ్లీ స్పీడు పెంచాడంటే.. అనివార్యంగా ఇద్దరూ ఉమ్మడిగానే పోరాడే ప్రయత్నం చేస్తారు. అందులో తిరుగులేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English