కాంగ్రెసుకి చిరంజీవే దిక్కు

కాంగ్రెసుకి చిరంజీవే దిక్కు

కర్నాటక ఎన్నికల ప్రచారంలో చిరంజీవి చెమటోడ్చుతుండగా, దానికి తగ్గ ఫలం కాంగ్రెసు పార్టీకి దక్కుతుందని మంత్రి రామచంద్రయ్య ధీమాతో ఉన్నారు. కర్నాటకలో ప్రజలు చిరంజీవికి బ్రహ్మరథం పట్టారని, చిరంజీవి ప్రచారం కర్నాటకలో కాంగ్రెసు పార్టీకి గెలుపు ఖాయం చేసిందని ఆయన చెప్పారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిరంజీవే గెలిపిస్తారని రామచంద్రయ్య అనడం కాంగ్రెసులో ఏళ్ళ తరబడి పాతుకుపోయినవారిని హర్ట్‌ చేసింది. కిరణ్‌ని పలు సందర్భాలలో వ్యతిరేకించిన రామచంద్రయ్య తాజా చిరు జపం ద్వారా కిరణ్‌ మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించారు. కాని కిరణ్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్న బొత్స వర్గానికి సంతోషపెట్టేలా ఆయన మాటలున్నాయి.
బొత్స, కిరణ్‌ల సారధ్యంలోనే కాంగ్రెసు పార్టీ 2014 ఎన్నికలకు వెళుతుందని రామచంద్రయ్య ఉవాచ. ఆయన మనసులో ఏమున్నా, మాటలు మాత్రం కాంగ్రెసు పార్టీకి చిరంజీవే దిక్కు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English