చేతకాక చేతులెత్తేసి..

చేతకాక చేతులెత్తేసి..

పాకిస్తాన్‌ ప్రధమ పౌరుడిగా అంటే ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేసిన పర్వేజ్‌ ముషారఫ్‌ జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. పాకిస్తాన్‌ ఎన్నికల్లో పోటీ చేసి అధికార పీఠమెక్కాలని భావించిన ముషారఫ్‌, ప్రధాని పదవి ఖాయమనే నమ్మకంతో విదేశాలనుంచి తిరిగొచ్చారు. కాని అతనిపై పాత కేసులన్నీ బూజు దులిపి అతన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా చేశారు. తను అరెస్టవుతాడని తెలిసే ఇన్నాళ్ళూ అజ్ఞాతంలోకి పారిపోయాడతను.
ప్రధాని అయితే అన్ని కష్టాలూ తీరుతాయనుకున్నాడుగాని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకుండా జైల్లోనే ఉండాల్సి వస్తుందని ఊహించలేకపోయిన ముషారఫ్‌, ఇప్పుడో కొత్త కహానీ వినిపించడం మొదలు పెట్టాడు. అదేమంటే తనకు జరిగిన అవమానానికి నిరసనగా ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నామని ముషారఫ్‌ నేతృత్వంలోని పార్టీ వెల్లడించింది. 160 మంది వరకూ అభ్యర్థులు ఎన్నికల బరిలో ముషారఫ్‌ పార్టీ నుంచి నిలబడగా, అతని తాజా వైఖరి వారందర్నీ ఆశ్చర్యపరిచింది.
ముషారఫ్‌ నియంతగా పాక్‌ చరిత్రలో పేరు గాంచారు, ఆ నియంతృత్వమే రాజకీయాల్లోనూ ప్రదర్శించినట్లయ్యింది ఇప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English