రాజమౌళి ఛాన్స్‌ ఇస్తాడా మరి?

రాజమౌళి ఛాన్స్‌ ఇస్తాడా మరి?

రాజమౌళి ఎంత బిజీగా ఉన్నా కానీ వేరే సినిమాలు రిలీజ్‌ అయినప్పుడు వాటిని ఖచ్చితంగా చూసి తన వ్యూస్‌ చెబుతుంటాడు. తెలుగులో ఎలాంటి సినిమాలు వస్తున్నాయనేది ఎప్పటికప్పుడు చూసి అప్‌డేట్‌ అవుతుంటాడు. అలాగే బాహుబలి సినిమా ప్రిపరేషన్స్‌లో ఉన్నా కూడా తన బృందంతో కలిసి 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమా చూశాడు రాజమౌళి. ఈ చిత్రంపై, దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన రాజమౌళి ప్రత్యేకించి నిత్యా మీనన్‌ని తెగ పొగిడేశాడు. గతంలో కూడా ఆమె నటించిన చిత్రాలు చూసి నిత్యపై రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా ఆమె కాస్త తన వెయిట్‌పై కాన్సన్‌ట్రేట్‌ చేసి దానిని తగ్గించుకుంటే పెద్ద రేంజ్‌కి వెళుతుందని చెప్పాడు. తనని ఇంతగా ఆకట్టుకున్న నిత్యామీనన్‌కి రాజమౌళి ఎప్పటికైనా ఛాన్స్‌ ఇస్తాడా? ప్రస్తుతం నిత్యామీనన్‌ మిడ్‌ రేంజ్‌ హీరోయిన్‌గానే మిగిలిపోయింది. అంత టాలెంట్‌ ఉన్నా ఆమెకి స్టార్‌ హోదా దక్కడం లేదు. రాజమౌళిలాంటి దర్శకుడి సినిమాలో నటిస్తే స్టార్‌డమ్‌ దానంతట అదే తన్నుకుంటూ వచ్చేస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు