తెలంగాణపై దూసుకెళుతున్న టీడీపీ

తెలంగాణపై దూసుకెళుతున్న టీడీపీ

తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ విస్పష్టమైన సంకేతాల్ని ఇస్తోంది. ఇటీవల జరిగిన మహానాడులో స్పష్టమైన తీర్మానం చేసి టీఆర్ఎస్ గుండెల్లో గుబులు పుట్టించిన టీడీపీ.. అనంతరం.. తెలంగాణకు తమ ముఖ్యమంత్రి అబ్యర్థుల పేర్లను సైతం వెల్లడించింది. 2014 ఎన్నికల అనంతరం అత్యధిక సీట్లను సాధించే పార్టీగా పలు సర్వేలు ప్రకటిస్తున్న నేపథ్యంలో  ఆ పార్టీ నేతలు కీలకమైన అంశాన్ని ఒకదాన్ని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఈసారి తృతీయకూటమి కేంద్రంలో చక్రం తిప్పుతుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటిస్తేనే తృతీయ ఫ్రంట్ లో చేరుతామని స్పష్టం చేసింది. తద్వారా.. జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ నేతలకు తెలంగాణపై సానుకూల వైఖరి కలిగి ఉండాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.

అదే సమయంలో ఆసక్తికరమైన మరో వ్యాఖ్యను ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. ఫలానా రీతిలో లేఖ రాసిస్తే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందని చెప్పినట్లయితే... ఆ విధంగానే రాసి తమ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేత సంతకం చేయిస్తామని చెప్పారు. ఒకవేళ పార్లమెంటులో బిల్లు పెడితే తాము మద్దతిస్తామనీ స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణపై తీర్మానం చేయిస్తామని చెప్పారు. రోజురోజుకీ తెలంగాణపై క్లియర్ గా చెబుతున్న టీడీపీ దూకుడుతనాన్ని చూసి టీఆర్ఎస్ నేతలు కలత చెందుతున్నారు. ఎక్కడ తమ వారు జారిపోతారోనని బెంగ పడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English