మేనల్లుడా మజాకా

మేనల్లుడా మజాకా

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్‌ భన్సాల్‌కి మేనల్లుడి రూపంలో 'స్ట్రోక్‌' తగిలింది. ఈ దెబ్బకి ఆయన మంత్రి పదవి ఊడిపోతుందేమో కూడాను. భన్సల్‌ మేనల్లుడు వి.సింగ్లా, కుమార్‌ అనే వ్యక్తికి రైల్వే శాఖలో ఉన్నత హోదా ఇప్పిస్తానని చెప్పి మంజునాథ్‌ అనే మధ్యవర్తి వద్ద 90 లక్షలు కొట్టేశాడు. ఇది సిబిఐ కంట పడింది. సిబిఐకి అడ్డంగా దొరికిపోయిన సింగ్లా పరిస్థితేమోగాని భన్సల్‌ రాజకీయంగా ఇరుకునపడ్డాడు.
మావయ్య కోసమే సింగ్లా ఇదంతా చేశాడని అర్థమవుతున్నది. కాని భన్సల్‌, తన మేనల్లుడితో ఆర్థిక లావాదేవీల్లేవని చెప్పారు. ప్రధానికీ ఈ వివాదంపై వివరణ ఇచ్చారుగాని అతన్ని ఎవరూ నమ్మే పరిస్థితి కానరావడంలేదు. రైల్వే శాఖ మంత్రి పదవి అంటే చాలా ప్రతిష్టాత్మకమైనది. చాలా సంవత్సరాల తరువాత కాంగ్రెసు నేతకి ఈ పదవి దక్కింది. దాన్ని భన్సల్‌ క్యాష్‌ చేసుకున్నారనే విమర్శలూ విపక్షాల నుంచి వస్తుండగా, మేనల్లుడి దెబ్బకి రాజకీయ సన్యాసం తీసుకోక తప్పేలా లేదని భన్సల్‌ కూడా ఆవేదన చెందుతున్నార్ట. కాంగ్రెస్‌ అధిష్టానం కరుణిస్తే గనుక భన్సల్‌ ఈ వివాదం నుంచి గట్టెక్కగలుగుతారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English