తెలంగాణలో ఆగిన టీవీ 9, ఏబీఎన్

తెలంగాణలో ఆగిన టీవీ 9, ఏబీఎన్

 తెలంగాణ ప్రజాప్రతినిధులను అవహేళన చేసేవిధంగా కథనాలు ప్రసారం చేశారంటూ టీవీ 9 పైనా.. అసత్యకథనాలు ప్రచురించారంటూ ఏబీఎన్ పైనా తెలంగాణ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటువంటి అవహేళన కార్యక్రమాలు మానుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని  అసెంబ్లీ సాక్షిగా ఆయన హెచ్చరించారు కూడా. దీనికోసం తమిళనాడు తరహా కేబుల్ నియంత్రణ చట్టాన్ని కూడా చేయడానికి వెనుకాడమని చెప్పారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా కేసీఆర్  ఇంకా నిషేధం విధిస్తామని హెచ్చరించారోలేదో తెలంగాణ ఎంఎస్ఓలు అప్పడు ఈ రెండు చానళ్లపై నిషేధం విధించేశారు.

అసలు సంగతి ఏమిటంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా తడబడ్డారు. తెలుగును చదవడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. దీనిపై టీవీ 9 ఓ సెటైర్ ప్రోగ్రాం చేసింది. భాష కూడా సరిగా లేని వీరా మన ప్రజాప్రతినిధులు అని ఎగతాళి చేసింది. మరోపక్క సీమాంధ్రనుంచి  ఇసుక రవాణా ఆగిపోయిందని.. దాని వల్ల తెలంగాణలో నిర్మాణరంగంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

ఈ మధ్యకాలంలో ఇటువంటికి సర్వసాధారణమైపోయాయి. ప్రతి చానల్ కూడా ఏదో ఒక సెటైర్ ప్రోగ్రాం చేస్తూ రాజకీయ నాయకులను ఎండగడుతోంది. వారిపై జోకులేస్తోంది. వీ 6, టీ చానల్ కూడా వీటికి అతీతమేమీ కాదు. అయినా టీవీ 9, ఏబీఎన్ ఏదో పెద్ద చేయరాని తప్పు చేసినట్లు కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. దీంతో తెలంగాణ ఎంఎస్ఓలు ఆ రెండు చానళ్ల ప్రసారాలు నిలిపివేయడం.. జరిగిపోయింది. కానీ  ఈ చర్యసరికాదని.. సదరు చానళ్లు చేసింది ప్రస్తుత పరిస్థితుల్లో తప్పే కాదని.. ఒక వేళ తప్పే అయినా నిషేధం విధించక్కర్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో దొరల పాలన సాగుతోందనటానికి ఇటువంటి చర్యలు నిదర్శనమంటున్నారు, మరి తెలంగాణలో జరిగేది దొరల పాలనే కదా??

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు