ఇలా ఎలా మారిపోతారు?

ఇలా ఎలా మారిపోతారు?

రాజకీయాల్లో నాయకులు 'గోడ దూకడం' కొత్త కాకపోయినప్పటికినీ దాడి వీరభద్రరావు లాంటి సినియర్‌ రాజకీయ నాయకులు పార్టీలు మారి, రాత్రికి రాత్రే తమ సిద్ధాంతాలు మార్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
జగన్‌పై దాడి చేసిన లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు గల్లంతయిపోయాయి, జగన్‌ వల్లనే రాష్ట్రం బాగుపడుతుందనే స్థాయికి ఆయన జగన్‌పై పొగడ్తలు కురిపించడం జరుగుతున్నది. దాడి వీరభద్రరావుని ఇప్పటిదాకా విమర్శించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు నేతలు ఇప్పుడాయన వల్ల తమ పార్టీ బలపడుతుందని చెప్పుకుంటున్నారంటే ఆశ్చర్యమే కదా. తెలుగుదేశం పార్టీ తరఫున జగన్‌పై విమర్శలు చేశానని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు తరఫున ఇకపై మాట్లాడతానని చెప్పారు జైల్లో జగన్‌ని కలిసిన తర్వాత దాడి వీరభద్రరావు.
ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ఎలా విశ్వసించాలి? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. విశ్వసనీయతకు మారుపేరని చెప్పుకునే వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, రాత్రికి రాత్రి మిత్రులుగా మారిపోయే రాజకీయ శతృవులను ఎలా చేర్చుకుంటున్నదీ అంతు చిక్కడంలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English