అశోకుడికి కోపమొచ్చింది

అశోకుడికి కోపమొచ్చింది

ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కించుకోకపోయినా.. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల బిల్డప్ కేమీ తక్కువ ఉండడం లేదు. కేంద్ర నాయకులతో కలిసి తామేదో సీమాంధ్ర అభివృద్ధికి తెగ కష్టపడిపోతున్నట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారు. అడ్డగోలు విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతంలో కనీసం ముఖం చూపించడానికి భయపడే నేతలు ఢిల్లీలో  రౌండ్లు కొడుతూ టైంపాస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తామే అన్ని చర్యలు చేపట్టామని గొప్పలు పోతున్నారు. చివరికి అందరి చేతా ఛీకొట్టించుకుంటున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే అశోక్ గజపతిరాజుకే  కోపం వచ్చేలా చేశారేంటే వారి ప్రవర్తన ఎలా

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు చిరంజీవి, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలంతో పాటు.. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఢిల్లీలో హడావుడి మొదలు పెట్టారు. సీమాంధ్రకు యూపీయే కేటాయించిన అన్ని కేటాయింపులను వెంటనే అమలు చేయాలని కేంద్రమంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలో  పౌర విమాన యాన శాఖ మంత్రి , టీడీపీ సీనియర్ నేత అశోక గజపతిరాజు దగ్గరకు కూడా వెళ్లారు. వెళ్లినవాళ్లు తిన్నంగా ఉండక కృష్ణా జిల్లా గన్నవరం విమానశ్రయ విస్తరణ పనులు చేపట్టాలని కోరారు.

అసలే ముక్కుసూటిగా వ్యవహరించే మన అశోకుకి కోపం నషాళానికంటింది. పదేళ్లపాటు అధికారంలో ఉన్నారుకదా మరి అప్పుడేం చేశారు అని ఎదురు ప్రశ్నించారు. అసలు అప్పడు కనీసం భూసేకరణ కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు ఎకరం ఐదు లక్ష్లలు ఉండేదని ప్రస్తుతం కోటిరూపాయలైందని లెక్కలు చెప్పారు. మీరు అప్పడే భూసేకరణ చేసి ఉంటే ఈ రోజు ఇంత భారం ఉండేది కాదు కదా అని కడిగిపారేశారు. అశోక్ ఆగ్రహం చూసి నీళ్లు నమలడం కాంగ్రెస్ నేతల వంతైంది. ఇంకేమీ మాట్లాడలేక వినతిపత్రం ఒకటి ఇచ్చేసి చల్లగా బయటకు జారుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభవృద్ధికి తామే కష్టపడిపోతున్నట్లు కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇస్తున్నారని , వారు చెబితేగానీ మేము చేయమా అని టీడీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. మరి వారి ప్రశ్న సబబే కదా...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు