భూకంపం 'టేస్ట్‌' చూపించాల్సిందే

భూకంపం 'టేస్ట్‌' చూపించాల్సిందే

తెలంగాణ ఉద్యమం వల్ల పుట్టే భూకంపం టేస్ట్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి తెలిసిందని, తెలిసే తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఉద్యమ సత్తా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా చూపించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణ విషయంలో టిఆర్‌ఎస్‌పై కిరణ్‌రెడ్డి వెటకారాలు చేయడం ఎక్కువైంది ఇటీవల. దానిని కెసిఆర్‌ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నార్ట. 'టార్గెట్‌ కిరణ్‌రెడ్డి' అనే మిషన్‌కి కెసిఆర్‌ ప్లాన్‌ చేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు అనుకుంటున్నాయ్‌.
2009లో కెసిఆర్‌ నిరాహార దీక్ష దెబ్బకి తెలంగాణ భగ్గుమనగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. అదే కెసిఆర్‌ ఈ మూడేళ్ళుగా తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా కొనసాగించలేకపోయారనే విమర్శలూ ఎదుర్కొంటున్నారు. ఇదివరకు లేదుగాని కిరణ్‌రెడ్డి, కెసిఆర్‌ని, తెలంగాణ రాష్ట్ర సమితిని రెచ్చగొట్టే వ్యాఖ్యలైతే చేస్తున్నారు. దాంతో కెసిఆర్‌కి సహజంగానే ఒళ్ళు మండినట్టుగా ఉన్నది. ఈ మంట, కెసిఆర్‌ అన్నట్టుగా భూకంపమయి కిరణ్‌రెడ్డిని భయపెడుతుందో లేదో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English