కార్తికేయలో 23 నిమషాల గ్రాఫిక్స్

కార్తికేయలో 23 నిమషాల గ్రాఫిక్స్

స్వాతి, నిఖిల్ జంటగా చందు దర్శకత్వంలో తయారవుతున్న సినిమా కార్తికేయ. ఓ విభిన్నమైన కథ, కథనాలతో కూడిన సినిమా ఇది. పైగా కాస్త థ్రిల్లర్ లక్షణాలు కూడా పుష్కలంగా వున్నాయి. అందువల్ల ఈ సినిమాకు గ్రాఫిక్స్ అవసరం కూడా బాగానే వుంది. దాంతో మొత్తం 23 నిమషాల గ్రాఫిక్స్ కోసం కాస్త బాగానే ఖర్చు చేయాల్సి వచ్చిందని వినికిడి. సినిమా రష్ చూసిన వాళ్లు మంచి రిమార్కులు ఇవ్వడంతో బిజినెస్ ఓపెనింగ్ బాగానే జరుగుతోంది. జెమినీ టీవీకి శాటిలైట్ హక్కులు దఖలు పడే అవకాశం వుంది. 1.5 కోట్లకు బేరం జరుగుతోంది. 

చిత్ర నాయకా,నాయికలు వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో. ఈ నెల 27 న ఆడియో విడుదలకు రెడీ అవుతున్నారు. జూన్ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. హీరో నిఖిల్ ఇంత వరకు నటించిన సినిమాల్లో ఇదే పెద్ద బడ్జెట్ సినిమా. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళభర ణి,రాజా రవీంద్ర రావు రమేష్, ప్రవీణ్,తులసి,కిషోర్, స్వామిరారా సత్య, జోగినాయుడు,శివన్నారాయణ, జయప్రకాశ్, శంకర్ మెల్కోటే  నటిస్తున్నారు.ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: రామజోగయ్య శాస్త్రి, వనమాలి,కృష్ణ చైతన్య, ఆర్ట్: సాహి సురేష్, కో డైరెక్టర్ :అను కె రెడ్డి, 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English