తేదేపా పార్లమెంటరీ పక్ష నేతగా రాయపాటి?

తేదేపా పార్లమెంటరీ పక్ష నేతగా రాయపాటి?

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా సీనియర్ రాజకీయవేత్త రాయపాటి సాంబశివరావును నియమిస్తారని విశ్వసనీయవర్గాల బోగట్టా. నామా నాగేశ్వరరావు ఇంతవరకు ఈ పదవిలో వున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.అందువల్ల వేరే నేతను ఎన్నుకోవాల్సి వుంది. చాలా మంది ఎంపీలు వున్నా, వీరిలో ఎక్కువ మంది తొలిసారి ఎంపికైన వారు. రాయపాటి కూడా తెలుగుదేశం తరపున గెలవడం ఇదే ప్రథమం. కానీ ఆయన చాలా సీనియర్ రాజకీయవేత్త. పార్లమెంటరీ వ్వవహారాలు తెలిసినవాడు. అందువల్ల ఆయనను ఆ పదవికి చంద్రబాబు ఎంపికచేసే అవకాశం వుంది.

నిజానికి ఇలా చేయడం వల్ల ఆయన మంత్రి పదవికి దూరం కావచ్చు. కేంద్ర మంత్రి పదవని అశోక్ గజపతి రాజకు ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు. క్షత్రియులు ఈ ఎన్నికల్లో బాబుకు చేసిన ఉపయోగం ఇంతా అంతా కాదు. పశ్చిమగోదావరి జిల్లా ఫలితాలను ఏకపక్షం చేసింది వారే. అదీ కాక, భాజపా హరిబాబుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం వుంది. భాజపా, తేదేపా ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తే అంత బాగుండదు. పైగా నిన్ననే కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవి కట్టబెడితే పార్టీలోకి రాంగ్ సిగ్నళ్లు వెళతాయి. అలా అని రాయపాటిని కృష్ణా డెల్టాను విస్మరించే అవకాశం లేదు. అందుకే ఉభయతారకంగా, మధ్యేమార్గంగా ఆయనకు పార్లమెంటరీ పక్ష పగ్గాలు అప్పగిస్తే, కేబినెట్ పగ్గాలు అప్పగించినట్లు అవుతుంది.పైగా తమ సామాజికవర్గం చేతిలోనే పార్టీ నాయకత్వ బాధ్యతలు వుంటాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English