దీని భావమేమి బాబూ?

దీని భావమేమి బాబూ?

వచ్చే అయిదేళ్లలో లేదా ఆ లోపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం..ఏడాది లోపు అవినీతి పరులను అందరినీ జైలుకు పంపుతాం. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు రెండు ఇంటర్వూలలో చెప్పిన రెండు మాటలు. ఈ రెండు మాటలు బాబు ఎజెండాను చెప్పకనే చెబుతున్నాయి. తెలంగాణలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం వుంది. దానికి మెజారిటీ బొటాబొటీ కావచ్చు. కానీ ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై వుంది.

ఇదే ముక్య జగన్ అని వుంటే బాబు వైఖరి, స్పందన ఎలా వుండి వుండేది. అదిగో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి చూస్తున్నాడు అని దుమ్మెత్తి పోసేవారు. వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పడంలో తప్పు లేదు. అలా కాకుండా, ఆ లోపే రావచ్చు అనడం, బుర్రలో ఏదో ప్లాన్ వుంది అన్నదాన్ని సూచిస్తుంది.

ఇక ఏడాదిలోపు అవినీతి పరులను జైలుకు పంపుతాం అన్నది కూడా ఈ తరుణంలో అభ్యంతరకరమే. అవినీతిని సహిచం. అన్ని కేసులను త్వరితంగా విచారిస్తాం లాంటి మాటలు చెప్పచ్చు. కానీ పనిగట్టకుని జైలుకు పంపుతాం అంటే జనంలొకి, జగన్ సంగతి చూస్తాం అన్న సందేశంలా వెళ్తుంది. జనతా ప్రభుత్వానికి అధికారం ఇస్తే, ఇందిరను జైల్లో వేసింది. దాంతో జనం ఆమె అంటే భయంకరమైన సింపతీ పెంచుకుని, ఆ తరువాతి ఎన్నికల్లో అందలం ఎక్కించారు. ఇప్పుడు జగన్ కు తగ్గిన ఓట్ల శాతం రెండు మాత్రమే అని మరచిపోవడానికి లేదు.

అనవసరంగా జగన్ కు సింపతీ పెంచడం వృధా. నిజంగా కేసులు సాగి, నిర్థారణ అయినా, అభిమాన జనం కక్షసాధింపే అనుకుంటారు. ప్రతిసారీ వేవ్ లు అడ్డం రావు. ఆ సంగతి గుర్తెరిగి పాలించాలి చంద్రబాబు. ఇప్పటికి ఇలాంటి పర్సనల్, పార్టీ అజెండాలు పక్కన పెట్టి, ఏ అభివృద్ధి కోసం ప్రజలు పట్టం కట్టారో దానిపై దృష్టి పెట్టడం అవసరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు