అపాయింట్ డేట్ మరింత ముందుకు?

అపాయింట్ డేట్ మరింత ముందుకు?

జూన్ రెండు కొత్తగా ఏర్పడిన తెలంగాణకు అపాయింట్ డేట్. రెండు కొత్త పార్టీలు ప్రజాబలంతో ఎన్నికైనా, జూన్ రెండువరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు ఈ తేదీని ముందుకు జరపని అడిగేందుకు అదికారానికి సరిపడా మెజార్టీని ఇరు రాష్ట్రాల్లో సాధించిన పార్టీలు సిద్దమవుతున్నాయి. ఎలాగూ ఇరు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, పైగా విభజన వ్యవహారాలు చాలా వరకు కొలిక్కి వచ్చాయి కాబట్టి, ఇక రాష్ట్రపతి పాలన అనవసరం అన్నది ఈ పార్టీల అభిప్రాయం. దీనికి మోడీ సర్కారు చొరవ చూపాల్సివుంటుంది. మోడీ ప్రభుత్వం ఏర్పాడాలి. కేబినెట్ సమావేశమవ్వాలి. అప్పుడు రాష్ట్రపతి పాలన ఎత్తేస్తూ నిర్ణయం తీసుకోవాలి.
 
కానీ ఇక్కడో చిన్న చిక్కుంది. విభజన పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ నిర్ణయం వుంటేనే సరిగ్గా వుంటుంది. అందువల్ల గవర్నర్ అధికారాలను మరో పక్షం రోజులు వుంచేసే అవకాశమే ఎక్కువ వుంది. ఎలాగూ ఇంకా మోడీ ప్రమాణ స్వీకారం చేయాలి. మంత్రివర్గం కొలువుతీరాలి. కనీసం నాలుగైదు రోజులు పడుతుంది. ఆక్కడికి ఇంక మిగిలింది మహా అయితే పది రోజులు కూడా వుండదు. ఈ పాటి దానికి తొందరెందుకు?