డీఎల్ తదుపరి అడుగులెటు..

డీఎల్ తదుపరి అడుగులెటు..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి పయనమెటు అన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం అంతే సుతారమూ ఇష్టపడని డీఎల్ చివరికి తన పదవిని త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. మంత్రి పదవి పోయినందుకన్నా.. అవమానకర రీతిలో పంపించటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినా.. మీడియా ప్రతినిధులు ఇంటి ముందు కాపాలా కాస్తున్నా ఎంతకీ ఆయన పెదవి విప్పలేదు. మూడ్  లేదని మౌనం వహించారు.

 చివరికి.. సహనం నశించిన ఇద్దరు ముగ్గురు మీడియా ప్రతినిధులు మూడు మాటలు మాట్లాడండి... మా దారిన మేం పోతాం అనటంలో ఆయన ముక్తసరిగా మాట్లాడారు.  తాను పార్టీ మారేది లేదని.. చచ్చిన తర్వాత సైతం తన శవంపై కప్పేది కాంగ్రెస్ జెండానే కప్పుతారంటూ చెప్పుకొచ్చారు.  అయితే.. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్, మరోవైపు తెలుగుదేశం పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతున్న సమయంలో డీఎల్ ఇంత భావోద్వేగంతో మాట్లాడిన నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి జంప్ అవ్వటం ఇప్పట్లో ఉండనట్లే

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English